logo

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో యువకులతో సమావేశం

Published : 27 Jun 2022 04:28 IST

ఇల్లంతకుంట గ్రామస్థులతో డీఎస్పీ చంద్రశేఖర్‌ తదితరులు

ఇల్లంతకుంట, న్యూస్‌టుడే: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో యువకులతో సమావేశం నిర్వహించారు. యువకులు చెడు అలవాట్లకు బానిస కావద్దని, బంగారు భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దని సూచించారు. యువతతో పాటు విద్యార్థులు మాదక ద్రవ్యాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ ఉపేందర్‌, ఎస్సై మహేందర్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బోయినపల్లి, న్యూస్‌టుడే: బోయినపల్లి మండలంలోని వెంకట్రావుపల్లె, నీలోజిపల్లి, వరదవెల్లి గ్రామాలలో ఆదివారం మాదక ద్రవ్యాలపై బోయినపల్లి ఎస్సై అభిలాష్‌ యువకులకు అవగాహన కల్పించారు. అనంతరం యువతతో చెడు వ్యసనాలకు బారిన పడబోమని ప్రతిజ్ఞ చేయించారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బోయినపల్లిలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి సంపతి రమేశ్‌, మండల సభ్యులు శ్రీకాంత్‌, రాజు, ప్రశాంత్‌, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని