logo
Published : 27 Jun 2022 21:37 IST

Crime News: పెళ్లి విషయమై బస్టాండ్‌లో.. కత్తులతో బావబామ్మర్దుల వీరంగం

పెద్దపల్లి: పెళ్లి విషయమై బావబామ్మర్దులు నడిరోడ్డుపై కత్తులతో వీరంగం సృష్టించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పెద్దపల్లి మండలం అప్పనపేట గ్రామానికి చెందిన పిడుగు శ్రీకాంత్, గడ్డం అజయ్‌లు వరసకు మేన బావబామ్మర్దులు. పిడుగు శ్రీకాంత్ తన అక్కను పెళ్లి చేసుకోవాలంటూ తన బావ అజయ్‌తో తీవ్ర వాగ్వదానికి దిగగా, ఇది కాస్త ఘర్షణకు దారి తీసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బావ అజయ్‌ వెంట తెచ్చుకున్న కత్తితో శ్రీకాంత్‌పై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఆందోళనను గ్రహించిన స్థానికులు ఇరువురిని నిలువరించేందుకు ప్రయత్నం చేసే లోపే బామ్మర్ది శ్రీకాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఇద్దరిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts