logo

ఇంటి చెంతకే కార్గో సేవలు

టీఎస్‌ ఆర్టీసీ ఆదాయం పెంపు దిశగా అడుగులు వేస్తోంది. ఒక వైపు ప్రజా రవాణావ్యవస్థను కొనసాగిస్తూనే మరోవైపు కార్గో, పార్సిల్‌, కొరియర్‌ సేవల్లోకి అడుగు పెట్టింది.

Published : 28 Jun 2022 05:14 IST

న్యూస్‌టుడే, కరీంనగర్‌ రవాణావిభాగం


కరీంనగర్‌లోని పార్సిల్‌, కొరియర్‌ బుకింగ్‌ కౌంటర్‌

టీఎస్‌ ఆర్టీసీ ఆదాయం పెంపు దిశగా అడుగులు వేస్తోంది. ఒక వైపు ప్రజా రవాణావ్యవస్థను కొనసాగిస్తూనే మరోవైపు కార్గో, పార్సిల్‌, కొరియర్‌ సేవల్లోకి అడుగు పెట్టింది. వీటిని ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా తాజాగా హోం డెలివరీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లో ఈ నెల 10 నుంచి 16 సెంటర్లలో వీటిని అమలు చేస్తోంది. పార్సిళ్లను బుక్‌ చేయడానికి ఆయా ప్రాంతాలకు ప్రత్యేకంగా పిన్‌ నెంబర్లను కేటాయించారు. 500013 -అమీర్‌పేట్‌, సెంట్రల్‌ పోలీస్‌ లైన్స్‌, 39- ఉప్పల్‌, సర్వే ఆఫ్‌ ఇండియా, 07- హబ్సిగూడ, ఎన్జీఆర్‌ఐ, ఐఐసీీటీ, 17- లాలాపేట, లాలాగూడ, తార్నాక, 92- బొడుప్పల్‌, చింగిచర్ల, 03- బేగంపేట పోలీస్‌ లైన్స్‌, యం.జి రోడ్‌, ఆర్‌పీీ రోడ్‌, ప్యారడైస్‌, ఎస్పీ రోడ్‌, సికింద్రాబాద్‌, పికెట్‌, పీజీ రోడ్‌, ఎస్‌డీ రోడ్‌, 11- బోయినిపల్లి, 15- తిరుమలగిరి, 25- హిమాయత్‌నగర్‌, 26- నెహ్రూనగర్‌, 61-సీతాఫల్‌మండి, 09- మనోవికాస్‌నగర్‌/కార్ఖాన, 16- బేగంపేట్‌, 40- హౌసింగ్‌బోర్డు కాలనీ, మౌలాలి, 47-మల్కాజిగిరి, 76- నాచారం ఇండస్ట్రీయల్‌ ఎస్టేట్‌. కరీంనగర్‌ రీజియన్‌ నుంచి హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు పార్సిల్‌, కవర్లను పంపే వినియోగదారులు హోం డెలివరీ సేవలను వినియోగించుకోవాలని కరీంనగర్‌ జోన్‌ కార్గో సీటీఎం సురేష్‌చౌహాన్‌ తెలిపారు.

పార్సిల్‌ ధరలు : 5 కేజీల వరకు రూ.50, 6-10 కిలోలకు రూ.75, 11-30 కేజీల వరకు రూ.100,

పార్సిల్‌ కవర్స్‌: 500 గ్రాముల వరకు రూ.25, 501 నుంచి 1000 గ్రాముల వరకు రూ.40.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని