logo

గుట్టలు మాయం!

అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరించటం మట్టి వ్యాపారులకు వరంగా మారింది. గుట్టలను తవ్వి అక్రమంగా మట్టిని విక్రయిస్తూ జిల్లాలో భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. రెండు మూడేళ్లుగా గుట్టలు ఖాళీ చేశారు. అధికారుల ఉదాసీనత, ప్రజాప్రతినిధుల అండతో జిల్లాలో మట్టి తరలింపు మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది.

Published : 28 Jun 2022 05:38 IST

అక్రమంగా మట్టి తరలింపు

న్యూస్‌టుడే, జగిత్యాల గ్రామీణం


రాజారం శివారులో గుట్టను తవ్విన దృశ్యం

అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరించటం మట్టి వ్యాపారులకు వరంగా మారింది. గుట్టలను తవ్వి అక్రమంగా మట్టిని విక్రయిస్తూ జిల్లాలో భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. రెండు మూడేళ్లుగా గుట్టలు ఖాళీ చేశారు. అధికారుల ఉదాసీనత, ప్రజాప్రతినిధుల అండతో జిల్లాలో మట్టి తరలింపు మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది.

జిల్లా వ్యాప్తంగా..

కొత్తగా ఇళ్లు నిర్మించుకున్న, భూములను చదును చేసుకునేందుకు మొరం మట్టి అవసరం. నిబంధనల ప్రకారం మట్టిని తోడుకుని అవసరానికి ఉపయోగించుకోవాలి. కానీ గుట్టలకు యథేచ్ఛగా మట్టిని తవ్వటంతో పచ్చగా ఉండాల్సిన గుట్టలు బోసి పోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇదే దందా సాగుతోంది. జగిత్యాలతోపాటు, మెట్‌పల్లి, కోరుట్ల డివిజన్‌ పరిధిలో కొందరు ఇదే దందా కోసం జేసీబీలు, ట్రాక్టర్లను ఉపయోగిస్తూ మట్టి దందా సాగిస్తున్నారు. అధికారులు అడపాదడపా తనిఖీలు చేసి పట్టుకుంటున్నా ప్రజాప్రతినిధుల ఒత్తిడితో వదిలేస్తున్నారు. ఓ వైపు హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటుతూనే మరోవైపు మట్టి తరలింపు కోసం చెట్లను తొలగించి జేసీబీల సాయంతో మట్టిని తీస్తున్నారు.

భూముల ఆక్రమణ..

జగిత్యాల సమీపంలోని టీఆర్‌నగర్‌, రాజారం, నర్సింగాపూర్‌ గుట్టలు ఖాళీ అయ్యాయి. గుట్టలను ఖాళీ చేసిన తర్వాత కొందరు ఆ భూములను అక్రమించే పనిలో ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పదేళ్ల కిందట గుట్టలు బాగానే ఉన్నా టీఆర్‌నగర్‌, నర్సింగాపూర్‌, రాజారం శివారులో గుట్టలు ఖాళీ చేయటంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదీలా ఉంటే వరద కాలువ వెంట ఉన్న మొరాన్ని కూడా పూర్తిగా తవ్వేశారు. రోజు వేలాది ట్రాక్టర్లు, టిప్పర్లు తరలిపోతున్నా మైనింగ్‌ అధికారులు గానీ, రెవెన్యూ అధికారులు గానీ పట్టించుకోవటంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మట్టి తరలింపుపై అధికారులు కొరఢా ఝలిపిస్తే గుట్టలు కాపాడిన వారు అవుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని