logo

పది ఫలితాల్లో జయకేతనం

ఎస్సెస్సీ ఫలితాల్లో కరీంనగర్‌లోని పలు ప్రైవేటు పాఠశాలలు ఉత్తమ ఫలితాలను సాధించాయి. విద్యార్థులు పలువురు ఉత్తమ జీపీఏలను సాధించి పాఠశాలలకు వన్నెతెచ్చారు.

Published : 01 Jul 2022 03:01 IST

కరీంనగర్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఎస్సెస్సీ ఫలితాల్లో కరీంనగర్‌లోని పలు ప్రైవేటు పాఠశాలలు ఉత్తమ ఫలితాలను సాధించాయి. విద్యార్థులు పలువురు ఉత్తమ జీపీఏలను సాధించి పాఠశాలలకు వన్నెతెచ్చారు.


అల్ఫోర్స్‌ ప్రభంజనం..

10జీపీఏలు సాధించిన అల్ఫోర్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌ విద్యార్థులు

అల్ఫోర్స్‌ విద్యాసంస్థల్లో చదివిన పదో తరగతి విద్యార్థులు ఫలితాల్లో జయకేతనాన్ని ఏగురవేశారు. అల్ఫోర్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌కు చెందిన 139 మంది విద్యార్థులు 10 జీపీఏలను సొంతం చేసుకున్నారు. 141 మంది 9.8, వంద మంది 9.7 జీపీలను అందుకున్నారు. ఈ సందర్భంగా 10 జీపీఏలు సాధించిన విద్యార్థులను ఆవిద్యాసంస్థల ఛైర్మన్‌ డాక్టర్‌ వి.నరేందర్‌రెడ్డి పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు.


ట్రినిటీ విజయ కేతనం


విద్యార్థులను అభినందిస్తున్న ట్రినిటీ విద్యాసంస్థల ఛైర్మన్‌ ప్రశాంత్‌రెడ్డి

పెద్దపల్లి : పెద్దపల్లి ట్రినిటీ ఉన్నత పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. 59 మంది విద్యార్థులు 10 జీపీఏ, 56 మంది 9.8 జీపీఏ, 47 మంది 9.7 జీపీఏ సాధించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల ఛైర్మన్‌ ప్రశాంత్‌రెడ్డి విద్యార్థులను అభినందించారు. తమ పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఆయన తెలిపారు.


పారమిత సత్తా..

ఉత్తమ ఫలితాలు సాధించిన పారమిత పాఠశాలల విద్యార్థులు

స్థానిక పారమిత పాఠశాలలకు చెందిన పదో తరగతి విద్యార్థులు ఫలితాల్లో విద్యార్థులు సత్తా చాటారు. ఫలితాల్లో 26 మంది 10 జీపీఏలను సాధించగా, 31 మంది 9.8 జీపీఏలను సాధించినట్లు ప్రిన్సిపల్‌ ఆనంద్‌కమలాకర్‌ తెలిపారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను పాఠశాలల ఛైర్మన్‌ డాక్టర్‌ ఇ.ప్రసాదరావు అభినందించగా, డైరెక్టర్లు ప్రసూన, రష్మిత, ఆనూకర్‌రావు, వినోద్‌రావు, రాకేశ్‌రావు, వి.యు.ఎం.ప్రసాద్‌, హనుమంత రావు, ప్రధానోపాధ్యాయులు ఆనంద్‌ కమలాకర్‌, ఎం.శ్రీకర్‌, పి.ప్రశాంత్‌కుమార్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


శ్రీచైతన్య ఘనవిజయం

ఉత్తమ జీపీఏలు సాధించిన విద్యార్థులతో డైరెక్టర్‌ శ్రీవిద్య, ప్రిన్సిపల్స్‌, అధ్యాపకులు

ఖమ్మం విద్యావిభాగం : గురువారం ప్రకటించిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో రాష్ట్రంలోని తెలంగాణ శ్రీచైతన్య టెక్నో స్కూల్స్‌ విద్యార్థులు విజయదుందుభి మోగించారని శ్రీచైతన్య విద్యాసంస్థల ఛైర్మన్‌ మల్లెంపాటి శ్రీధర్‌, డైరెక్టర్‌ శ్రీవిద్య ఒక ప్రకటనలో తెలిపారు. 408 మంది విద్యార్థులు 10జీపీఏ సాధించారని, 914మంది 9.8జీపీఏ, 1,887మంది 9.5జీపీఏ, 2,846మంది 9.0జీపీఏ సాధించినట్లు తెలిపారు. ఏవన్‌ గ్రేడ్‌లను గణితంలో 2,998మంది, సాంఘికశాస్త్రంలో 2,284మంది, సైన్స్‌లో 1,874మంది, సబ్జెక్టు వారీగా మొత్తం 19,466మంది సాధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీచైతన్య విద్యాసంస్థల ఛైర్మన్‌ మల్లెంపాటి శ్రీధర్‌, డైరెక్టర్‌ శ్రీవిద్య మాట్లాడుతూ తమ విద్యార్థులు ఐఐటీతో పాటు స్టేట్‌ సిలబస్‌లో కూడా అత్యున్నత ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు.


మానేరు ఉత్తమ ఫలితాలు..

ఉత్తమ ఫలితాలు సాధించిన మానేరు విద్యాసంస్థల విద్యార్థులు

స్థానిక మానేరు విద్యాసంస్థలకు చెందిన ఎస్సెస్సీ విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారు. అయిదుగురు విద్యార్థులు 10 జీపీఏలను, 11  మంది 9.8 జీపీఏలను సాధించినట్లు ఆవిద్యాసంస్థల అధినేత కె.అనంతరెడ్డి తెలిపారు. 45 మంది విద్యార్థులు 9, ఆపై జీపీఏలను అందుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా వారిని అనంతరెడ్డితో పాటు డైరెక్టర్‌లు కె.సునీతారెడ్డి, కె.కృష్ణారెడ్డిలు, ప్రిన్సిపల్‌, ఉపాధ్యాయులు అభినందించారు.


దూసుకెళ్లిన సిద్ధార్థ

ప్రతిభ చూపిన సిద్ధార్థ పాఠశాలల విద్యార్థులు

ఎస్సెస్సీ ఫలితాల్లో స్థానిక మంకమ్మతోట, భగత్‌నగర్‌లోని సిద్ధార్థ ఆంగ్ల మాధ్యమం ఉన్నత పాఠశాలల విద్యార్థులు దూసుకెళ్లారు. 36 మంది విద్యార్థులు 10 జీపీఏలను సాధించగా, 39 మంది 9.8, 28 మంది 9.7, 32 మంది 9.5 జీపీలను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారిని పాఠశాల అకాడమిక్‌ డైరెక్టర్‌ దాసరి శ్రీపాల్‌రెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని