logo

వసతి గృహాలు.. సమస్యలకు నిలయాలు

పేద, మధ్యతరగతి, వెనుకబడిన వర్గాలకు చెందిన లక్షలాది మంది విద్యారులకు నాణ్యమైన విద్యనందించేకు ఏర్పాటుచేసిన వసతిగృహాలు సమస్యలకు నిలయంగా మారుతున్నాయి. అరకొర వసతులు, పారిశుద్ధ్య సమస్యలు, నాణ్యతలోపించిన భోజనంతో విద్యారులు అనారోగ్యాలకు గురవుతున్నారు.

Published : 07 Aug 2022 04:41 IST

పేద, మధ్యతరగతి, వెనుకబడిన వర్గాలకు చెందిన లక్షలాది మంది విద్యారులకు నాణ్యమైన విద్యనందించేకు ఏర్పాటుచేసిన వసతిగృహాలు సమస్యలకు నిలయంగా మారుతున్నాయి. అరకొర వసతులు, పారిశుద్ధ్య సమస్యలు, నాణ్యతలోపించిన భోజనంతో విద్యారులు అనారోగ్యాలకు గురవుతున్నారు. శుభ్రమైన మరుగుదొడ్లు, శుద్ధమైన తాగునీరు, మెనూ ప్రకారం భోజనం అందించడంలో అధికారులు విఫలమవుతున్నారు. విద్యాలయాలు, వసతిగృహాల్లో ఆహారం వికటించి విద్యారులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు ఇటీవల వెలుగుచూస్తున్నాయి. ఇటీవల జిల్లా కేంద్రంలోని వసతిగృహంలో భోజనం నాణ్యతలోపించిందని విద్యారులు కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని వసతిగృహాలను ‘న్యూస్‌టుడే’ బృందం పరిశీలించింది. ఆ వివరాలు...


నిర్వహణ లోపం..

జగిత్యాల పట్టణంలో 7 ఎస్సీ వసతిగృహాల్లో మొత్తం 407 మంది, 2 ఎస్టీ వసతిగృహాల్లో 74, మూడు బీసీ వసతిగృహాల్లో 300, మైనారిటీ, ఎస్సీ, బీసీ గురుకులాల్లో 2,500 మంది విద్యారులు ఉన్నారు. గురుకులాల్లో భోజన సన్నద్ధతను నిర్వాహకులు నిత్యం పర్యవేక్షిస్తుండగా, ఎస్టీ వసతిగృహాల పర్యవేక్షణాధికారి స్థానికంగా లేకపోవడంతో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి.
భోజనం విషయంలో నాణ్యత లోపించిందని ఇటీవల పలువురు విద్యారులు నేరుగా జిల్లా కలెక్టర్‌ జి.రవిని కలిసి ఫిర్యాదు చేయడం నిర్వహణ లోపాలను ఎత్తిచూపుతోంది. ప్రభుత్వం మంజూరిచ్చిన సరకులను వంటలో వినియోగించకుండా మధ్యలోనే మాయం అవుతున్నాయని ఉన్నతాధికారుల విచారణంలో తేలడం గమనార్హం. వసతిగృహాల విద్యారులు పగటి పూజ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో ఆహారం తీసుకోవడంతో, రాత్రిపూట కొందరు వార్డెన్లు సకాలంలో వసతిగృహాలకు రాకపోవడం మరికొన్ని సమస్యలకు కారణమని ఆరోపణలు ఉన్నాయి.

- జగిత్యాల విద్యానగర్‌


తాగునీటి ఎద్దడి

ధర్మపురి పట్టణంలోని కస్తూర్బా విద్యాలయంలో తాగునీటి సమస్యలు అధికంగా నెలకొన్నాయి. మొత్తం 6 నుంచి 10 తరగతులకు గాను 171 మంది విద్యారులు చదువుకుంటున్నారు. శనివారం విద్యారులకు మధ్యాహ్న భోజనంలో కూరతో పాటు పప్పు, సాంబారు, క్యాబేజ్‌ వండించారు. విద్యారులు ఆహ్లాదకరమైన వాతావరణంలోనే భోజనాన్ని స్వీకరించారు. గురుకులానికి రావడానికి రహదారి బురదగా ఉంటోందని, తాగునీటి సమస్యలు అధికంగా ఉన్నాయని విద్యారులు వాపోతున్నారు. మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా కావడం లేదని, బోర్‌వెల్‌ నీరందించడం లేదని నీటి సమస్యలను తీర్చాలని విద్యారులు కోరుతున్నారు.

- ధర్మపురి


పాలు, పెరుగుకు దూరం

మండలకేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంతో పాటు ఆదర్శ పాఠశాల వసతి గృహాల్లో శనివారం మెనూ ప్రకారం బీరకాయ కూర, చుక్కకూర పప్పును విద్యారులకు అందించాల్సి ఉంది. కానీ రెండింటిలోనూ బీరకాయ అందుబాటులో లేకపోవడంతో కస్తూర్బాలో టమాట కూర, పప్పు చారు, ఆదర్శలో ఆలు కూర, సాంబార్‌ను వడ్డించారు. ఆదర్శలో మూడు రోజులుగా విద్యారులకు పాలు, పెరుగు ఇవ్వడం లేదు. సిబ్బందిని వివరణ కోరగా బీరకాయలను గుత్తేదారుడు పంపించకపోవడంతో ప్రత్నామయంగా వేరే కూరను వడించినట్లు తెలిపారు. పాలు, పెరుగు టెండర్లు రద్దు కావడంతో వాటిని సరాఫరా చేయడం లేదని పేర్కొన్నారు.

- ఇబ్రహీంపట్నం


అసౌకర్యాల నడుమ  

కోరుట్ల పట్టణం అల్లమయ్యగుట్ట ప్రాంతంలోని సమీకృత వసతి గృహంలో 2017లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల, వసతి గృహం ఏర్పాటు చేశారు. కళాశాలలో మొత్తం 12 కోర్సులలో 560 మంది విద్యారినులు విద్యనభ్యసిస్తున్నారు. కేవలం 16 గదులు మాత్రమే ఉండటంతో తరగతి గదులు, వసతి రెండు ఒకే గదుల్లో నిర్వహిస్తున్నారు. విద్యారులకు మెనూ ప్రకారం ఉదయం అల్పాహారం, పాలు, మధ్యాహ్నం, రాత్రిపూట భోజనం, సాయంత్రం స్నాక్స్‌, ఫ్రుట్స్‌ను అందిస్తున్నారు. ఇంత మంది విద్యారినులకు వంట చేసేందుకు, భోజనం చేసేందుకు పూర్తిసాయి సౌకర్యాలు లేవు. చాలీచాలనీ హాల్‌లో విద్యారులనులను రెండు బృందాలుగా విభజించి నిత్యం భోజనం అందిస్తున్నారు. శాశ్వత భవనం లేకపోవడంతో విద్యారులు ఇబ్బందులు పడుతున్నారు.

- కోరుట్ల


నామమాత్రంగా ప్రవేశాలు

మండల కేంద్రంలో బీసీ, ఎస్సీ రెండు వేర్వేరు వసతి గృహాలు ఉన్నాయి. ఒక్కో వసతి గృహంలో 100 మందికి ప్రవేశాలు ఉండగా విద్యారులు నామమాత్రంగా ఉన్నారు. ఎస్సీ వసతిగృహంలో 15 మంది విద్యారులు ఉండగా బీసీ వసతి గృహంలో పది లోపు విద్యారులు ఉన్నారు. ఐదేళ్లుగా రెండు వసతి గృహాల్లో విద్యారుల ప్రవేశాలు నామమాత్రంగా ఉండగా ప్రవేశాల పెంపుపై అధికారులు దృష్టి సారించడం లేదు. ఎస్సీ వసతి గృహంలో విద్యుత్తు లైన్లు, పైకప్పు మరమ్మతులకు లోను కాగా పనులు సాగుతున్నాయి. ఎస్సీ వసతి గృహంలో కొన్ని కిటీకీలకు తలుపులు లేవు. బీసీ వసతి గృహంలో మరుగుదొడ్లు తలుపులు, పైకప్పుకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. విద్యారుల సంఖ్య తక్కువగా ఉండటంతో సంఖ్య పెరిగితే వసతిగృహంలోని వసతులు సరిపోవు. వార్డెన్లు స్థానికంగా ఉండకపోవడంతో విద్యారులపై పర్యవేక్షణ లేదు.

- రాయికల్‌ పట్టణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని