logo

జెండా పండుగకు కొత్త దుస్తులు అందేనా?

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టేందుకు మహిళా సంఘాలు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం చెల్లించే ఒక్కో జతకు రూ.50 గిట్టుబాటు కాదని అయిష్టత చూపుతున్నారు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్తు

Published : 08 Aug 2022 05:34 IST

కొత్తపల్లి మండలంలో కుట్టడానికి సిద్ధంగా వస్త్రాలు  

కరీంనగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టేందుకు మహిళా సంఘాలు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం చెల్లించే ఒక్కో జతకు రూ.50 గిట్టుబాటు కాదని అయిష్టత చూపుతున్నారు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు 597 ఉన్నాయి. 33 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికి ఏకరూప దుస్తులు ఇచ్చేందుకు ప్రభుత్వం వస్త్రం సరఫరా చేసింది.  మహిళా సంఘాలకు 70 శాతం, బయటి వారికి 30 శాతం వస్త్రాలు కుట్టించి ఇవ్వడానికి ఆదేశాలు జారీ అయ్యాయి. ఆగస్టు 15లోపు ఏకరూప దుస్తులు కుట్టించి విద్యార్థులకు అందించాలని లక్ష్యం నిర్దేశించినా.. జిల్లా వ్యాప్తంగా సగం మండలాల్లోనే ఈ నెల 4వ తేదీ వరకు 70 మంది సంఘ సభ్యులు 12,460 డ్రెస్‌లు కుట్టినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఇదే పద్ధతిన కుట్టుపనులు జరిగితే ఆగస్టు 15 వరకు సగం మంది విద్యార్థులకు కూడా ఏక రూప దుస్తులు అందించలేని పరిస్థితి నెలకొంది.


జతకు రూ.50 గిట్టుబాటు కాదని
-కటకం దీప్తి, గ్రామ సంఘ మాజీ అధ్యక్షురాలు, కొత్తపల్లి మండలం

ఏకరూప దుస్తులు కుట్టడానికి అధికారులు ఇచ్చే రూ.50తో ధర గిట్టుబాటు కాదని సభ్యులు ముందుకు రావడం లేదు. కనీసం రోజు వారి కూలీ పడటం లేదు. ధర పెంచి ఇస్తే గాని కుడతామని సిద్ధమని సంఘ సభ్యులు తెలిపారు.


సంఘ సభ్యులకు అవగాహన కల్పిస్తున్నాం
-వెంకటేశ్వర్లు, అదనపు డీఆర్డీవో, కరీంనగర్‌

ఇప్పటికే దుస్తులు కుట్టే పనిని సంఘ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 15 లోపు ఏకరూప దుస్తులను కుట్టించి విద్యార్థులకు అందే విధంగా  సభ్యులతో చర్చిస్తున్నాం. పంద్రాగస్టులోపు విద్యార్థులకు అందేలా చూస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని