logo

అధ్యయన కేంద్రాలుగా రైతు వేదికలు

రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని గొప్పగా అభివృధ్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని.. గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతు వేదికలు అధ్యయన కేంద్రాలుగా ఉపయోగపడనున్నాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఆదివారం సాయంత్రం మంత్రి అంతర్గాం

Published : 08 Aug 2022 05:34 IST

బ్రహ్మణపల్లిలో ఎంపీపీ కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి ఈశ్వర్‌, ఎమ్మెల్యే చందర్‌

అంతర్గాం, న్యూస్‌టుడే : రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని గొప్పగా అభివృధ్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని.. గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతు వేదికలు అధ్యయన కేంద్రాలుగా ఉపయోగపడనున్నాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఆదివారం సాయంత్రం మంత్రి అంతర్గాం మండలంలోని సోమనపల్లిలో రైతు వేదిక భవనం, బ్రహ్మణపల్లిలో మండల పరిషత్‌ కార్యాలయ భవనాన్ని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి ప్రారంభించారు. శిలాఫలకాలు ఆవిష్కరించారు. ఎంపీపీ కార్యాలయ భవనం ప్రారంభంతో పల్లె ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి 57 ఏళ్లు దాటిన వారికి నూతన పింఛన్లు, డయాలిసిస్‌ రోగులకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. పంటల సాగుకు 24 గంటలు ఉచిత విద్యుత్తు, ఎరువులు పంపిణీ, రైతు బీమా, రైతు బంధు వంటి పథకాల ద్వారా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి తెలిపారు. వరి పంటలతోపాటు లాభదాయకమైన వాణిజ్య పంటల సాగుపై ఆసక్తి కనబరచాలన్నారు. మద్దిర్యాలలో బొడ్రాయి, గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పాల్గొన్నారు. ఎంపీపీ దుర్గం విజయ, జడ్పీటీసీ సభ్యుడు ఆముల నారాయణ, ఉప ఎంపీపీ మట్ట లక్ష్మీ మహేందర్‌రెడ్డి, ఏఎంసీ ఛైర్మన్‌ అల్లం రాజయ్య, మేడిపల్లి ప్యాక్స్‌ ఛైర్మన్‌ మామిడాల ప్రభాకర్‌, సర్పంచులు కొల్లూరి సత్య సతీష్‌, సందెల దివ్య మల్లయ్య, బండారి ప్రవీణ్‌కుమార్‌, కో-అప్షన్‌ సభ్యుడు గౌస్‌పాషా, రామగుండం నగర మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని