logo

సమయం ముగిసింది... పరీక్ష చేజారింది

పరీక్ష కేంద్రానికి ఓ యువతి ఏడు నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. దీంతో అభ్యర్థిని లోపలికి అనుమతించలేదు. గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో పరీక్ష రాయకుండానే ఆ యువతి వెనుదిరిగి వెళ్లింది.  

Published : 08 Aug 2022 05:34 IST

అనుమతించాలని సీఐని అడుగుతున్న ప్రియాంక

గోదావరిఖని : పరీక్ష కేంద్రానికి ఓ యువతి ఏడు నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. దీంతో అభ్యర్థిని లోపలికి అనుమతించలేదు. గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో పరీక్ష రాయకుండానే ఆ యువతి వెనుదిరిగి వెళ్లింది.  పెద్దపల్లి మండలం గోపయ్యపల్లికి చెందిన ప్రియాంక అక్కడి నుంచి రావడానికి సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఆలస్యమైందని పోలీసు అధికారులకు విన్నవించింది. అయితే నిమిషం నిబంధన కారణంగా పరీక్ష కేంద్రంలోకి అనుమతించమని అధికారులు వెల్లడించారు. గ్రామం నుంచి రావడానికి వాహనాలు అందుబాటులో లేకపోవడంతో చేరుకోవడానికి కొంత ఆలస్యమైందని విన్నవించింది. నిబంధనల ప్రకారం పరీక్ష కేంద్రంలోకి అనుమతించమని పోలీసు అధికారులు వెల్లడించారు. తండ్రితో కలిసి వచ్చిన ఆమె కొద్దిసేపు పోలీసు అధికారులను బతిమాలుకున్నా ఫలితం లేకుండా పోయింది.

పెద్దపల్లి : పెద్దపల్లిలోని మూడు కేంద్రాలలో నిర్వహించిన పరీక్షలకు ఒక్కో కేంద్రంలో ఒక్కొక్కరు ఆలస్యంగా రావడంతో అధికారులు వారికి వెనక్కి పంపించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గుండారానికి చెందిన పావని ఎనిమిది నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. మధర్‌ థెరిస్సా ఇంజినీరింగ్‌ కళాశాలలోని కేంద్రానికి రామగుండంకు చెందిన త్రిలాచన్‌ ఆరు నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు. ట్రినిటీ ఇంజినీరింగ్‌ కళాశాల కేంద్రంలో మరో అభ్యర్థి ఆరు నిమిషాలు ఆలస్యంగా రావడంతో అధికారులు వారిని వెనక్కి పంపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని