logo

అతివల ఉపాధికి అభయం

ఇంట్లో ఉంటున్న పేద యువతులకు కుట్టు శిక్షణ వరంగా మారింది. స్వయం ఉపాధిలో శిక్షణ అందించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందిస్తోంది అభయ ఫౌండేషన్‌ స్వచ్చంధ సంస్థ. హైదరాబాద్‌ వారి శాఖ ఆధ్వర్యంలో మానకొండూర్‌ మండలం

Published : 08 Aug 2022 05:38 IST

ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న సంస్థ

కొండపల్కలలో శిక్షణ ఇస్తున్న శిక్షకురాలు

న్యూస్‌టుడే, మానకొండూర్‌: ఇంట్లో ఉంటున్న పేద యువతులకు కుట్టు శిక్షణ వరంగా మారింది. స్వయం ఉపాధిలో శిక్షణ అందించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందిస్తోంది అభయ ఫౌండేషన్‌ స్వచ్చంధ సంస్థ. హైదరాబాద్‌ వారి శాఖ ఆధ్వర్యంలో మానకొండూర్‌ మండలం కొండపల్కలలో గత మూడు నెలల నుంచి 30 మందికి ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చారు. ఇందులో జాకెట్లు, పంజాబీ డ్రెస్సులు, గౌన్లు, చుడిదార్‌, చిన్నారులకు దుస్తులు తదితర వాటిపై శిక్షణ తీసుకున్నారు. మానకొండూర్‌, దేవంపల్లి, పచ్చునూర్‌, ఊటూర్‌, అన్నారంలో విడతల వారిగా శిక్షణ ఇస్తున్నారు.  మహిళలకు కుట్టు యంత్రాలు అందజేశారు. సంస్థ సమన్వయకర్త ఆరెల్లి అరుణ ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగింది.  

తోడ్పాటును ఇచ్చింది - ఎగ్గోజు లావణ్య, కొండపల్కల

కుట్టు శిక్షణ నేర్చుకోవాలని చాల రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. పేద కుటుంబం కావడంతో  కరీంనగర్‌కు వెళ్లి శిక్షణ తీసుకోవాలంటే ఖర్చుతో కూడుకుంది. స్వచ్ఛంద సంస్థ ఛైర్మన్‌ సుంకు బాలచందర్‌ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వడం సంతోషం కల్గించింది. ప్రస్తుతం దుస్తులు కుట్టుతున్నాను.

మహిళలకు ఉపయోగం -వాణి, కొండపల్కల

కుట్టు శిక్షణ తీసుకోవడానికి మరొక గ్రామానికి వెళ్లడానికి ఆటోలో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇబ్బందులను గమనించిన  సంస్థ  శిక్షణ ఇస్తామని ముందుకు రావడంతో అందులో చేరాం. మూడు నెలల నుంచి శిక్షణ తీసుకుంటున్నాం.

నేర్చుకున్న విద్యను అందిస్తున్నాను -స్వప్న, శిక్షకురాలు

తాను నేర్చుకున్న విద్యను పది మందికి అందించడం ఎంతో సంతోషంగా ఉంది. గత ఐదేళ్ల నుంచి మహిళలకు సంస్థ ద్వారా ఐదు గ్రామాల్లో కుట్టు శిక్షణ నేర్పించాను. ప్రస్తుతం ఉపాధి కల్గడంతో వారి కాళ్లపై వారు నిలబడి జీవనోపాధి పొందుున్నారు.  

మహిళలకు చేయూత అందిస్తున్నాం -బాలచందర్‌, అభయ ఫౌండేషన్‌ ఛైర్మన్‌

గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ చదువుకునే సదుపాయం లేక ఏమి చేయాలో తెలియక జీవనం సాగిస్తున్న మహిళలకు చేయూతను అందించాలనే ఆలోచనతో సంస్థ ద్వారా ఎంతో మందికి ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించాం. పట్టణాలకు వలస వెళ్లకుండా గ్రామంలోనే ఉపాధి కల్పించే దిశలో పని చేస్తున్నాం. 500 గ్రామాల్లో ఉచిత శిక్షణ ఇచ్చాం. కుట్టు, కంప్యూటర్‌, చరవాణి రిపేరు, మగ్గం, బ్యూటిషియన్‌, డ్రైవింగ్‌ తదితర వాటిలో శిక్షణ ఇచ్చాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని