logo

నిధులు వస్తేనే... రహదారుల బాగు

జగిత్యాల జిల్లాలో గత మూడేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలతోపాటు ఈ ఏడాది కురిసిన వర్షాలతో రహదారులు దెబ్బతిన్నాయి. జిల్లాలో పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ రహదారుల మరమ్మతు కోసం తక్షణం రూ.100 కోట్లు కావాలని రెండు శాఖలు ప్రభుత్వానికి

Published : 10 Aug 2022 04:55 IST

రూ.100 కోట్లకు ప్రతిపాదనలు
జగిత్యాల గ్రామీణం, న్యూస్‌టుడే
 

దెబ్బతిన్న రహదారి

గిత్యాల జిల్లాలో గత మూడేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలతోపాటు ఈ ఏడాది కురిసిన వర్షాలతో రహదారులు దెబ్బతిన్నాయి. జిల్లాలో పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ రహదారుల మరమ్మతు కోసం తక్షణం రూ.100 కోట్లు కావాలని రెండు శాఖలు ప్రభుత్వానికి నివేదించాయి. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే రహదారులు బాగయ్యే అవకాశం ఉంది. జిల్లాలో పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీతోపాటు జాతీయ రహదారులు విస్తరించి ఉన్నాయి. గత మూడేళ్లుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీశాఖ రహదారులే అధికంగా దెబ్బతిన్నాయి. గతంలో దెబ్బతిన్న రహదారులకు తోడు గత నెల నుంచి కురుస్తున్న వర్షాలకు దారులు అధ్వానంగా మారాయి. పంచాయతీరాజ్‌శాఖ 973 కిలోమీటర్ల రహదారులు దెబ్బతినగా అందుకు రూ.39.20 కోట్ల నిధులు కావాల్సి ఉంది. ఆర్‌అండ్‌బీ శాఖకు చెందిన రహదారులు 3852 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. వీటి మరమ్మతు కోసం రూ.59.47 కోట్ల నిధులు అవసరం.

అనంతారం వాగు వంతెనపై పారుతున్న నీరు

లోలెవల్‌ వంతెనల వద్ద ఇక్కట్లు
జిల్లాలో రహదారులు అధ్వానంగా మారగా లోలెవల్‌ వంతెనలతో సైతం ప్రజలకు ఇబ్బందులు తప్పటంలేదు. చిన్నపాటి వర్షం వస్తే వంతెనలపై వరద ఉప్పొంగటంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. అనంతారం వంతెన, ధర్మపురి మండలం నేరెళ్ల వద్ద వంతెన నిర్మాణాలు లేక భారీ వర్షాలతో లోలెవల్‌ వంతెనలు మునిగిపోయి రెండుమూడు రోజులు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఆయా నిర్మాణాలకు నిధులు కేటాయించకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో 35కు పైగా లోలెవల్‌ వంతెనలు ఉండగా వాటికి వెంటనే నిధులు మంజూరు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని