logo

మహనీయుల స్ఫూర్తి చిరస్మరణీయం

నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా కేవీ కేశవులు, సంగనభట్ల మాణిక్యశాస్త్రి చూపిన తెగువ నేటికీ చిరస్మరణీయమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలు పురస్కరించుకొని ధర్మపురిలో కేవీ

Published : 10 Aug 2022 04:55 IST

రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌

మాట్లాడుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌

ధర్మపురి, న్యూస్‌టుడే : నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా కేవీ కేశవులు, సంగనభట్ల మాణిక్యశాస్త్రి చూపిన తెగువ నేటికీ చిరస్మరణీయమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలు పురస్కరించుకొని ధర్మపురిలో కేవీ కేశవులు ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ధర్మపురి గడ్డ చైతన్యానికి ప్రతీకగా నిలుస్తోందని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ, మన రాష్ట్రానికి స్వాతంత్య్రం రాని తరుణంలో ధర్మపురి ప్రజలను చైతన్యపర్చి కేవీ కేశవులు ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల నుంచి తప్పించుకున్నారని నాటి ఘటనను స్మరించుకున్నారు. ధర్మపురిలో కేవీ కేశవులు, మాణిక్యశాస్త్రిల విగ్రహాలను త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజలు ఇంటింటా త్రివర్ణ పతాకాన్ని స్వచ్ఛందంగా ఎగురవేయాలని కోరారు. పెద్దపల్లి ఎంపీˆ వెంకటేశ్‌నేత మాట్లాడుతూ.. ధర్మపురి గడ్డపై మహనీయులు మాణిక్యశాస్త్రి, కేవీ కేశవులు చూపిన తెగువ మరవలేనిదని, నాటి స్ఫూర్తితో స్వాతంత్య్ర ఫలాలు అట్టడుగు వర్గాలకు సైతం చేర్చాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లా కలెక్టర్‌ రవి, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, డీసీˆఎంఎస్‌ ఛైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ రాజేశ్‌, జడ్పీ సభ్యురాలు బత్తిని అరుణ, ఎంపీˆపీˆ చిట్టిబాబు, పురపాలక అధ్యక్షురాలు సంగి సత్తెమ్మ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని