logo

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న భాజపా

దేశం కోసం... ధర్మం కోసం అంటూనే భాజపా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. ఏదైనా నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధి చనిపోతే ఉప ఎన్నిక రావాలి గానీ, పదవిలో

Published : 10 Aug 2022 04:55 IST

మాజీ ఎంపీ పొన్నం.. పాదయాత్ర ప్రారంభం

పాదయాత్రలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, చిత్రంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్‌

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: దేశం కోసం... ధర్మం కోసం అంటూనే భాజపా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. ఏదైనా నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధి చనిపోతే ఉప ఎన్నిక రావాలి గానీ, పదవిలో ఉన్న వారిచే రాజీనామా చేయించి ఉప ఎన్నికలు తీసుకొస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది దురదృష్టకర పరిణామంగా అభివర్ణించారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఆయన కరీంనగర్‌ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఈ నెల 9 నుంచి 18 వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట గ్రామంలోని పెద్దమ్మస్టేజి నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్‌రెడి,్డ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌తో కలిసి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రానికి పునాది అయిన నెహ్రూ, పేదల అభ్యున్నతికి కృషి చేసిన ఇందిరాగాంధీ, దేశానికి సాంకేతికతను పరిచయం చేసిన రాజీవ్‌గాంధీ, పీవీ నర్సింహారావు, మన్మోహన్‌సింగ్‌లు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలను ఈ తరం ప్రజలకు తెలియజెప్పేందుకు ప్రజల్లోకి వెళ్తున్నట్లు తెలిపారు. వీటితోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు తెలియజేసేందుకు పాదయాత్ర చేస్తున్నట్లు వెల్లడించారు. కరీంనగర్‌ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలను కలుపుతూ తొమ్మిది రోజులు 125 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగుతుంది. ఈ నెల 18న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ముగుస్తుంది. తొలిరోజు భారీ వర్షంలో ప్రారంభమైన పాదయాత్ర 15 కిలోమీటర్లు ప్రయాణించి ఎల్లారెడ్డిపేటకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని