logo

హుజూరాబాద్‌లో భారీ తిరంగా జెండా ప్రదర్శన

స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా  భాజపా పట్టణశాఖ ఆధ్వర్యంలో హుజూరాబాద్‌లో  300 మీటర్ల జాతీయ జెండాలతో భారీ ప్రదర్శన యాత్ర చేపట్టారు. బుధవారం సాయంత్రం భాజపా కార్యకర్తలు అంబేడ్కర్‌ కూడలికి  ప్రదర్శనగా చేరుకున్నారు.

Published : 11 Aug 2022 06:28 IST


అంబేడ్కర్‌ కూడలి చుట్టూ జెండా ప్రదర్శన

హుజూరాబాద్‌, న్యూస్‌టుడే:  స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా  భాజపా పట్టణశాఖ ఆధ్వర్యంలో హుజూరాబాద్‌లో  300 మీటర్ల జాతీయ జెండాలతో భారీ ప్రదర్శన యాత్ర చేపట్టారు. బుధవారం సాయంత్రం భాజపా కార్యకర్తలు అంబేడ్కర్‌ కూడలికి  ప్రదర్శనగా చేరుకున్నారు. నినాదాలతో కూడలి చుట్టూ తిరిగారు. వేడుకలను ఉద్దేశించి పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశ సమైఖ్యతను చాటే విధంగా  ప్రతి ఇంటిపై జెండాను ఎగురవేయాలనే కార్యాచరణతో ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు.  కార్యక్రమంలో భాజపా నేతలు గంగిశెట్టి రాజు, వెంకట్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌, ముత్యంరావు, సుధాకర్‌, నరసింహరాజు, ఆదిరెడ్డి, సంపత్‌రావు,  పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని