logo

చికిత్స పొందుతూ యువ రైతు మృతి

అప్పుల బాధతో ఆత్మహత్యాయత్నం చేసిన యువరైతు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఎలిగేడు మండలం ముప్పిరితోటలో చోటుచేసుకొంది. ఎస్సై వెంకటకృష్ణ, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం

Published : 11 Aug 2022 06:46 IST


రాకేశ్‌

సుల్తానాబాద్‌, న్యూస్‌టుడే: అప్పుల బాధతో ఆత్మహత్యాయత్నం చేసిన యువరైతు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఎలిగేడు మండలం ముప్పిరితోటలో చోటుచేసుకొంది. ఎస్సై వెంకటకృష్ణ, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన బత్తిని రాకేశ్‌(25) ఉపాధి కోసం సౌదీ వెళ్లగా, కరోనా కారణంగా రెండేళ్ల కిందట స్వగ్రామానికి వచ్చాడు. ఎనిమిది నెలల కిందట కాల్వశ్రీరాంపూర్‌ మండలం పెగడపల్లికి చెందిన యువతితో వివాహమైంది. గతేడాది తనకున్న మూడెకరాల పొలంలో పత్తి సాగు చేయగా, అధిక వర్షాలతో దిగుబడి రాలేదు. దీంతో పెట్టుబడికి, సౌదీ వెళ్లేందుకు అయిన ఖర్చులన్నీ కలిసి రూ.3 లక్షల అప్పయింది. దాన్ని తీర్చే దారి లేక జులై 29న పత్తి చేలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి రాకేశ్‌ మృతి చెందాడు. మృతుడి తండ్రి శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

ప్రమాదంలో గాయపడిన వ్యక్తి...
ధర్మారం, న్యూస్‌టుడే: ధర్మారం మండలం మల్లాపూర్‌ శివారులో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కాగా చికిత్స పొందుతూ అతడు మంగళవారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కరీంనగర్‌ వైపు నుంచి ధర్మారం వైపునకు వస్తున్న కారు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై రాజస్థాన్‌లోని నాగోర్‌ జిల్లాకు చెందిన హరేంద్రరామ్‌(28), ఒడిశాలోని గాజాం జిల్లాకు చెందిన రాజాస్వేయిన్‌(17) వస్తున్నారు. ఈ ప్రమాదంలో హరేంద్రరామ్‌ ప్రమాద స్థలంలోనే మృతి చెందగా, రాజాస్వేయిన్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాజాస్వేయిన్‌ సోదరుడు వుషితస్వేయిన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని