logo

జిల్లాలో 257 ఫ్రీడం పార్కుల ఏర్పాటు

వజ్రోత్సవాల సందర్భంగా జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో 257 ప్రాంతాల్లో ఫ్రీడం పార్కులను ఏర్పాటు చేసి మొక్కలు నాటుతున్నట్లు కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి పేర్కొన్నారు. బుధవారం స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఫ్రీడం పార్కులో కలెక్టర్‌ మొక్కలు నాటారు

Published : 11 Aug 2022 06:57 IST

వేములవాడలో మొక్క నాటుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ మాధవి తదితరులు

వేములవాడ, న్యూస్‌టుడే: వజ్రోత్సవాల సందర్భంగా జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో 257 ప్రాంతాల్లో ఫ్రీడం పార్కులను ఏర్పాటు చేసి మొక్కలు నాటుతున్నట్లు కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి పేర్కొన్నారు. బుధవారం స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఫ్రీడం పార్కులో కలెక్టర్‌ మొక్కలు నాటారు. అనంతరం పట్టణంలో అభివృద్ధి చేయనున్న కూడళ్లను ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు 15 రోజుల పాటు వజ్రోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సాధించిన గాంధీ గురించి విద్యార్థులకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో గాంధీ చలన చిత్ర ప్రదర్శన నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.  ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగుర వేసి జాతి సమైక్యత, స్ఫూర్తిని చాటాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి, కమిషనర్‌ శ్యామ్‌సుందర్‌రావు, వైస్‌ ఛైర్మన్‌ మధురాజేందర్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ మహేష్‌రావు, కౌన్సిలర్లు, అటవీశాఖ అధికారులు, కోఆప్షన్‌ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని