logo

మార్కండేయ శోభాయాత్ర

సిరిసిల్లలోని నూలు పౌర్ణమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్టణంలోని మార్కండేయస్వామి దేవాలయంలో జంజిర ధారణ జరిగింది. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. యజ్ఞం నిర్వహించారు.

Published : 13 Aug 2022 04:07 IST

నేతన్న విగ్రహానికి పూలమాల వేస్తున్న ఛైర్‌పర్సన్‌ కళ తదితరులు

సిరిసిల్ల (విద్యానగర్‌), న్యూస్‌టుడే: సిరిసిల్లలోని నూలు పౌర్ణమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్టణంలోని మార్కండేయస్వామి దేవాలయంలో జంజిర ధారణ జరిగింది. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. యజ్ఞం నిర్వహించారు. సాయంత్రం శ్రీశివభక్త మార్కండేయస్వామి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మార్కండేయ దేవాలయం నుంచి గాంధీచౌక్‌, అంబేడ్కర్‌చౌక్‌ మీదుగా నేతన్న చౌక్‌ వరకు ఇది కొనసాగింది. అక్కడ నేతన్న విగ్రహానికి పూలమాలలేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలతో సందడి చేశారు. కార్యక్రమంలో సిరిసిల్ల పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ, తెరాస రాష్ట్ర నాయకుడు గూడూరి ప్రవీణ్‌, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు గోలి వెంకటరమణ, మండల సత్యం, గుండ్లపెల్లి పూర్ణచందర్‌, లగిశెట్టి శ్రీనివాస్‌, కాముని వనిత, దార్నం అరుణ తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్లలో శోభాయాత్రలో పాల్గొన్న పద్మశాలీలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని