logo

త్రివర్ణ శోభితం.. స్వేచ్ఛా ర్యాలీ

స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా అంబేడ్కర్‌ స్టేడియం నుంచి టవర్‌ సర్కిల్‌ వరకు నిర్వహించిన స్వేచ్ఛా ర్యాలీ త్రివర్ణ శోభితంగా సాగింది. విద్యార్థులు, అధికారులు, ఉద్యోగులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, స్కౌట్స్‌, గైడ్స్‌తో కలిసి కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు,

Published : 14 Aug 2022 06:26 IST

కరీంనగర్‌లో జరిగిన ర్యాలీలో మేయర్‌ సునీల్‌రావు, సీపీ సత్యనారాయణ, అదనపు కలెక్టర్‌లు గరిమా అగ్రవాల్‌, శ్యాంప్రసాద్‌లాల్‌ తదితరులు

కరీంనగర్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా అంబేడ్కర్‌ స్టేడియం నుంచి టవర్‌ సర్కిల్‌ వరకు నిర్వహించిన స్వేచ్ఛా ర్యాలీ త్రివర్ణ శోభితంగా సాగింది. విద్యార్థులు, అధికారులు, ఉద్యోగులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, స్కౌట్స్‌, గైడ్స్‌తో కలిసి కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు, సీపీ సత్యనారాయణ, మువ్వన్నెల బెలూన్లు వదిలి ర్యాలీని ప్రారంభించారు. దేశభక్తిని తట్టిలేపే నినాదాలతో ర్యాలీ సాగింది. అనంతరం టవర్‌ సర్కిల్‌ వద్ద ఏర్పాటు చేసిన జనగణమన కార్యక్రమంలో పాల్గొన్నారు. మేయర్‌ సునీల్‌రావు మాట్లాడుతూ.. జిల్లాలో వజ్రోత్సవం విజయవంతం చేయడంలో ప్రతీ ఒక్కరు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ.. అమరుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్‌లాల్‌, గరిమా అగ్రవాల్‌, డీవైఎస్‌వో కె.రాజవీరు, ఉపమేయరు చల్ల స్వరూపారాణి, హరిశంకర్‌, టీఎన్జీవో అధ్యక్ష, కార్యదర్శులు మారం జగదీశ్వర్‌, దారం శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు తుమ్మల రమేష్‌రెడ్డి, కోశాధికారి నాగిరెడ్డి సిద్ధారెడ్డి, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని