logo

పసికందు మృతి.. ఆసుపత్రి ఎదుట ఆందోళన

హుజూరాబాద్‌ ప్రభుత్వ ప్రాంతీయాసుపత్రికి ప్రసవం కోసం వచ్చిన గర్భిణికి ఆసుపత్రిలో సేవలందించే నర్సులే సుఖప్రసవం చేయగా పురిటిలోనే పసికందు మృతిచెందడంతో బాధితులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. 

Published : 14 Aug 2022 06:33 IST

మృతిచెందిన  పసికందుతో ఆందోళన చేస్తున్న బాధిత కుటుంబీకులు

హుజూరాబాద్‌ పట్టణం, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ ప్రభుత్వ ప్రాంతీయాసుపత్రికి ప్రసవం కోసం వచ్చిన గర్భిణికి ఆసుపత్రిలో సేవలందించే నర్సులే సుఖప్రసవం చేయగా పురిటిలోనే పసికందు మృతిచెందడంతో బాధితులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.  శంకరపట్నం మండలం మొలంగూరుకు చెందిన గర్భిణి శ్రావణికి పురిటి నొప్పులు రాగా శుక్రవారం స్థానిక ఆసుపత్రికి తీసుకొచ్చారు. విధుల్లో ఉన్న డాక్టర్‌ నార్మల్‌ డెలివరీ అవుతుందని తెలపగా రాత్రి వేళల్లో నొప్పులు ఎక్కువ రావడంతో నర్సులే ఆపరేషన్‌ థియేటర్‌కు తరలించారు. రాత్రి 10 గంటలకు పాప పుట్టిందని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని  వరంగల్‌ ఎం.జి.ఎం ఆసుపత్రికి తరలించాలని శ్రావణి భర్త పవన్‌కు చెప్పారు. అప్పటికి పసికందులో ఎలాంటి చలనం లేకుండా ఉండగా గమనించిన పవన్‌ నర్సులను నిలదీయగా స్పృహ లేదని చెప్పి పంపారు. 108అంబులెన్సు ద్వారా ఎం.జి.ఎం ఆసుపత్రికి వెళ్లగా అప్పటికే  మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో శనివారం హుజూరాబాద్‌ ప్రాంతీయాసుపత్రికి చేరుకుని ఆసుపత్రి ఎదుట బైఠాయించి పసికందు మృతికి కారణమైన వైద్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వీరికి మద్దతుగా విద్యార్థి సంఘ నాయకులు ఆసుపత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజేందర్‌రెడ్డి, ఆర్‌ఎంవో డాక్టర్‌ సుధాకర్‌రావు, ఎస్సై ఆసిఫ్‌, పోలీసుల సమక్షంలో బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పుట్టిన బిడ్డ మృతికి కారణమైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని