logo

లోక్‌అదాలత్‌లో 1,179 కేసుల పరిష్కారం

జిల్లాలో శనివారం నిర్వహించిన లోక్‌అదాలత్‌లో మొత్తం 1,179 కేసుల పరిష్కారమయ్యాయని జిల్లా న్యాయమూర్తి నాగరాజు తెలిపారు. వీటిలో 1,169 క్రిమినల్‌ కేసులు, 10 సివిల్‌ కేసులున్నాయి. బ్యాంకు రుణాలకు సంబంధించిన కేసుల్లో

Published : 14 Aug 2022 06:33 IST

బ్యాంకు అధికారులకు పత్రాలు అందజేస్తున్న జిల్లా జడ్జి నాగరాజు

పెద్దపల్లి, న్యూస్‌టుడే: జిల్లాలో శనివారం నిర్వహించిన లోక్‌అదాలత్‌లో మొత్తం 1,179 కేసుల పరిష్కారమయ్యాయని జిల్లా న్యాయమూర్తి నాగరాజు తెలిపారు. వీటిలో 1,169 క్రిమినల్‌ కేసులు, 10 సివిల్‌ కేసులున్నాయి. బ్యాంకు రుణాలకు సంబంధించిన కేసుల్లో రూ.21.4 లక్షలు, చెక్‌ బౌన్స్‌ కేసుల్లో రూ.20.96 లక్షలు, ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో రూ.17.35 లక్షలను కక్షిదారులు చెల్లించారు.

గోదావరిఖని: జాతీయ లోక్‌ అదాలత్‌లో గోదావరిఖని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి, మొదటి, రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుల్లో న్యాయమూర్తులు దుర్గం గణేశ్‌, ప్రియాంక రాజీకి వచ్చిన 22 కేసులను పరిష్కరించారు. బాధితులకు రూ.10,90,000 పరిహారం ఇప్పించారు. భవాని, గోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌, సంతోష్‌, సౌభాగ్య, సంజయ్‌కుమార్‌, ఉమర్‌, పీపీ రవీందర్‌, బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మంథని గ్రామీణం: మంథని కోర్టులో జరిగిన లోక్‌అదాలత్‌లో రాజీ కుదిరిన కేసులను పరిష్కరించారు. అనంతరం న్యాయవాదులు కోర్టు ఆవరణలో జాతీయ జెండాలను ప్రదర్శించారు. సబ్‌ కోర్టు న్యాయమూర్తి వరూధిని, న్యాయమూర్తి శ్రీధర్‌, పీపీలు రాము, ప్రణయ్‌కుమార్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని