logo

స్వాతంత్ర్యానికి ముందే... రయ్‌ రయ్‌

స్వతంత్రానికి ముందు గ్రామీణ ప్రాంతాల్లో ఒక ప్రదేశం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే కాలినడకన వెళ్లేవారు. ఆ తర్వాత పల్లకీలు, గుర్రాలు, కచ్చురాలు రవాణా సాధనాలుగా ఉపయోగించే వారు. స్వాతంత్య్రానికి

Updated : 14 Aug 2022 08:40 IST

కరీంనగర్‌ ఒకటో డిపో ఏర్పాటై 76 ఏళ్లు

న్యూస్‌టుడే, కరీంనగర్‌ రవాణా విభాగం

స్వతంత్రానికి ముందు గ్రామీణ ప్రాంతాల్లో ఒక ప్రదేశం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే కాలినడకన వెళ్లేవారు. ఆ తర్వాత పల్లకీలు, గుర్రాలు, కచ్చురాలు రవాణా సాధనాలుగా ఉపయోగించే వారు. స్వాతంత్య్రానికి ముందే నిజాం స్టేట్‌ రోడ్‌, రైల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేశారు. అప్పట్లోనే కరీంనగర్‌కు రవాణా సౌకర్యం కలిగింది. భారత స్వతంత్ర వజ్రోత్సవాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఆర్‌ఆర్‌టీడీ నుంచి టీఎస్‌ఆర్టీసీ దాకా ఎదిగిన తీరుపై ‘న్యూస్‌టుడే’ కథనం.

ప్రస్తుతం కరీంనగర్‌ కలెక్టరేట్‌ రోడ్‌లో ఉన్న మ్లల్టీప్లెక్స్‌ స్థానంలో బస్టాండ్‌ ఉండేదని చరిత్రకారులు చెబుతారు. 1946 జూన్‌ 16 (ఆర్టీసీ రికార్డుల ప్రకారం) బస్సు డిపో ఏర్పాటు చేశారు. అప్పట్లో దక్కన్‌ మోటారు ఆయిల్‌ కంపెనీ సంస్థ జిల్లాలో 14 బస్సులు నడిపినట్లు సమాచారం. 96 మంది కార్మికులు సేవలందించే వారని చరిత్రను బట్టి తెలుస్తోంది. కాలక్రమంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నిజాం ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తులను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అప్పటి వరకు ఉన్న 14 బస్సుల స్థానంలో 19 సీట్ల సామర్థ్యం గల బస్సులను అందుబాటులోకి తెచ్చారు. వీటిని కాజిపేట, నిజామాబాద్‌, డిచ్‌పల్లి, కామారెడ్డి, హైదరాబాద్‌, పెద్దపల్లి, మంథని, వెంకటాపురం లాంటి ప్రాంతాలకు నడిపేవారు. 1952లో గ్యారేజీ, మెయింటనెన్స్‌, ఇతర సౌకర్యాలతో కరీంనగర్‌ -1 డిపో పూర్తిస్థాయిగా ఏర్పడింది. డిపో ఏర్పడి 76 ఏళ్లు పూర్తి చేసుకొని 77 వసంతంలోకి అడుగు పెట్టింది. 1991లో డిపో నుంచి కరీంనగర్‌-2 డిపోను నెలకొల్పారు.

* తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2015-2016 తెలంగాణ రాష్ట్ర రోడ్‌ ట్రాన్స్‌ పోర్టు సంస్థగా ఆవిర్భవించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11 రీజియన్‌లు, 97 డిపోలు, 9,734 బస్సులతో 90 లక్షల మంది ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేస్తుంది. 48 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పల్లె నుంచి పట్టణం వరకు ఆర్టీసీ తన సేవలను విస్తరించింది. కొరియర్‌, పార్సిల్‌, కార్గో సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది.


ప్రస్తుతం కరీంనగర్‌-1 డిపో

లాభాల బాటలో....
అనేక ఒడిదొడుకులు, పీకల్లోతు నష్టాల్లో ఉన్న కరీంనగర్‌-1 డిపో నేడు లాభాల బాట పట్టింది. ప్రస్తుతం రోజుకు వేలాది మందిని వివిధ ప్రాంతాలకు చేరవేస్తూ, రోజుకు 46 వేల కిలో మీటర్లు (షెడ్యూల్‌) రూ.19 లక్షల ఆదాయం రాబడుతుంది. జూన్‌లో రూ.38.33 లక్షల లాభాలను మూటగట్టుకుంది. కరీంనగర్‌ రీజియన్‌ను నిరంతరం లాభాల బాటలో నడపడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆర్‌ఎం ఖుస్రోషఖాన్‌, ఒకటో డిపో మేనేజర్‌ ఎస్‌.భూపతిరెడ్డి తెలిపారు.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని