logo

మన వంగడాలకు ఐసీఏఆర్‌ గుర్తింపు

ఉత్తర తెలంగాణ మండలంలోని మూడు వంగడాలను నోటిఫై(గుర్తింపు) చేస్తూ భారత వ్యవసాయ పరిశోధన మండలి నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

Updated : 18 Aug 2022 06:55 IST

కేంద్రం నోటిఫై చేసిన వరి రకాలు

జగిత్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే: ఉత్తర తెలంగాణ మండలంలోని మూడు వంగడాలను నోటిఫై(గుర్తింపు) చేస్తూ భారత వ్యవసాయ పరిశోధన మండలి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. జగిత్యాల పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానంలో రూపొందించిన జేసీఎస్‌-3202 నువ్వురకం, పెద్దపల్లి జిల్లా కూనారం వ్యవసాయ పరిశోధనస్థానంలో రూపొందించిన కేఎన్‌ఎం-7048 (తెలంగాణ రైస్‌-6), కేఎన్‌ఎం-1665 (తెలంగాణ రైస్‌-7) రకాలను ఐసీఏఆర్‌ గుర్తించినట్లు జగిత్యాల పరిశోధనస్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ ఎం.ఉమాదేవి తెలిపారు. కేంద్రం గుర్తించిన నువ్వురకం అధిక దిగుబడినిచ్చేదిగా రైతుల క్షేత్రాల్లో విజయవంతమైందన్నారు. అలాగే రెండు వరిరకాలు కూడా దొడ్డుగింజ కలిగి మంచి దిగుబడిని ఇస్తుండటంతో ఐసీఏఆర్‌ గుర్తింపు సాధ్యపడిందన్నారు. ఈ సందర్భంగా నూతన వంగడాల రూపకల్పనకు కృషిచేసిన పొలాస శాస్త్రవేత్త డాక్టర్‌ డి.పద్మజ, కూనారం పరిశోధనస్థానం అధిపతి డాక్టర్‌ శ్రీధర్‌ సిద్ధిలను, ఇతర శాస్త్రవేత్తలను ఏడీఆర్‌ అభినందించారు. పొలాస పరిశోధనస్థానంలో రూపొందించిన మరో నువ్వురకం, రెండు వరి రకాలు కూడా రాష్ట్రప్రభుత్వ ద్వారా అధికారికంగా విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు ఏడీఆర్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని