logo

ధరణి పోర్టల్‌తో పూర్తి స్థాయి సంరక్షణ

రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్‌ 2020లో ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చిందని, ధరణి పోర్టల్‌తో రైతుల భూమికి పూర్తిస్థాయిలో సంరక్షణ ఉంటుందని జిల్లా కలెక్టర్‌ జి.రవి అన్నారు. కొడిమ్యాల మండల పరిషత్తు కార్యాలయంలో ధరణి పోర్టల్‌పై మండలంలోని ప్రజాప్రతినిధులు,...

Published : 29 Sep 2022 04:53 IST


కొడిమ్యాల: సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి

కొడిమ్యాల, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్‌ 2020లో ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చిందని, ధరణి పోర్టల్‌తో రైతుల భూమికి పూర్తిస్థాయిలో సంరక్షణ ఉంటుందని జిల్లా కలెక్టర్‌ జి.రవి అన్నారు. కొడిమ్యాల మండల పరిషత్తు కార్యాలయంలో ధరణి పోర్టల్‌పై మండలంలోని ప్రజాప్రతినిధులు, రైతులకు రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరైన కలెక్టర్‌ రవి మాట్లాడుతూ రైతులకు ధరణి పోర్టల్‌పై అవగాహన లేకపోవడంతో తమ భూసమస్యల పరిష్కారానికై తహసీల్దార్‌, కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, అలాంటి రైతులకు ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించి సరైన మార్గంలో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం తహసీల్దార్‌ స్వర్ణ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ధరణి పోర్టల్‌పై అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్‌ లత, ఆర్డీవో మాధురి, ఎంపీపీ మేనేని స్వర్ణలత, సర్పంచుల ఫోరం అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు, ఎంపీడీవో పద్మజ, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు సహకరించాలి
జగిత్యాల, న్యూస్‌టుడే: ప్రభుత్వ లక్ష్యసాధనలో బ్యాంకర్లు లక్ష్యాలను అధిగమించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి బ్యాంకర్లను ఆదేశించారు. జిల్లాలోని బ్యాంకు రుణ లక్ష్యాలపై కలెక్టర్‌ కార్యాలయంలో సంబంధిత బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు రుణాలు ఎంతమేరకు ఇచ్చారు ఇంకా ఎంతపెండింగ్‌ ఉంది అనే అంశంపై మాట్లాడారు. జిల్లాలో ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద పెండింగ్‌లో ఉన్న 52 యూనిట్లను తక్షణమే గ్రౌండింగ్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని వ్యవసాయ రుణాలకు సంబంధించి యాసంగిలో రూ.284 కోట్ల పంట రుణంకు గాను రూ.163 కోట్లు రుణాలిచ్చారని వీధి వ్యాపారులకు రూ. మొదటి విడతలో 11,320 మంది, రెండవ విడతలో 4000 మందికి రుణాలు మంజూరు చేశామన్నారు. మూడో విడత రుణాలకు సంబంధించి బ్యాంకులు అర్హులైన లబ్ధిదారులకు రుణాలందించాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ పొన్న వెంకటరెడ్డి, ఆర్బీఐ ఎల్‌.డి.ఓ.కె. అనిల్‌కుమార్‌, నాబార్డు ఎజీఎం పి.అనంత్‌, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా రీజినల్‌ హెడ్‌ అరుణ్‌కుమార్‌, ఎస్బీఐ రీజనల్‌ మేనేజర్‌ ఫణి శ్రీనివాసులతోపాటు వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని