logo

ప్రభుత్వ శాఖలకు కార్యాలయాల కష్టాలు

జిల్లా కేంద్రమైన జగిత్యాలలో పలు ప్రభుత్వ శాఖలకు కార్యాలయ కష్టాలు తీవ్రమయ్యాయి. ఆగ్రోస్‌ ఆవరణలోని భవనంలో జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖల...

Published : 29 Sep 2022 04:53 IST


జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖ కార్యాలయ భవనం

జగిత్యాల ధరూర్‌క్యాంపు, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రమైన జగిత్యాలలో పలు ప్రభుత్వ శాఖలకు కార్యాలయ కష్టాలు తీవ్రమయ్యాయి. ఆగ్రోస్‌ ఆవరణలోని భవనంలో జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖల కార్యాలయాలుండగా వైద్యకళాశాలకు ఈ స్థలం కేటాయించటంతో భవనాన్ని కూల్చివేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖల కార్యాలయాలు నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ సముదాయంలోకి వెళ్లాల్సి ఉంది. కలెక్టరేట్ ప్రారంభం వాయిదా పడటంతో గత్యంతరంలేక రెండు జిల్లా కార్యాలయాలను ప్రైవేటుగా అద్దె భవనాల్లోకి హుటాహుటిన తరలించాల్సి వచ్చింది. మరోవైపు ఆగ్రోస్‌స్థలాన్ని, భారీ గోదామును వైద్యకళాశాలకు తీసుకోగా ఆగ్రోస్‌కు మరోచోట తగినట్లుగా స్థలాన్ని కేటాయించక బుల్‌డోజర్లు తదితర వాహనాలు సామగ్రిని తరలించేందుకు అవస్థలు పడుతున్నారు. జగిత్యాల వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో డివిజన్‌ వ్యవసాయ సహాయ సంచాలకుల కార్యాలయ భవనం, భూసార పరీక్ష కేంద్రం కొనసాగుతుండగా ఈ స్థలంలో సమీకృత మార్కెటును నిర్మిస్తున్నందున ఈ రెండు భవనాలను కూల్చివేయనున్నారు. జగిత్యాల తహసీల్‌ చౌరస్తాలోని తహసీల్దార్‌ కార్యాలయం పక్కనగల గోదాములో జగిత్యాల అర్బన్‌, జగిత్యాల రూరల్‌ మండలాల కార్యాలయాలుండగా ఈ స్థలాన్ని న్యాయస్థానాల పార్కింగ్‌కు కేటాయించటంతో ఈ రెండు కార్యాలయాలూ తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని