logo

రైతులు రాజకీయ శక్తిగా మారాలి

రైతులు రాజకీయ శక్తిగా ఎదగినప్పుడే అన్నదాతల శ్రమకు తగిన ఫలితం దక్కుతుందని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. బుధవారం కోరుట్లలో విలేకరుల సమావేశంలో మాట్లారు.

Published : 29 Sep 2022 04:53 IST

ప్రజాగాయకుడు గద్దర్‌


కోరుట్లలో మాట్లాడుతున్న గద్దర్‌

కోరుట్ల, న్యూస్‌టుడే: రైతులు రాజకీయ శక్తిగా ఎదగినప్పుడే అన్నదాతల శ్రమకు తగిన ఫలితం దక్కుతుందని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. బుధవారం కోరుట్లలో విలేకరుల సమావేశంలో మాట్లారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంభించడంతో అన్నదాతలకు తీవ్రనష్టం వాటిల్లుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంగా మారిన బతుకమ్మ రాజకీయ పార్టీలకు బుద్దిచెప్పే విధంగా మారోమారు ఉద్యమ బతుకమ్మగా అవతారం ఎత్తాలని తెలిపారు. తెలంగాణలో లిక్కర్‌, భూమాఫియాలే రాష్ట్రాన్ని నడిపిస్తున్నాయని విమర్శించారు. కోరుట్ల నియోజకవర్గంలోని ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని తెరిచేందుకు అన్నదాతలు ఏళ్లతరబడి చేస్తున్న పోరాటానికి తన మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. గల్ఫ్‌ కార్మికుల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. చెరుకు రైతు ఉత్పత్తిదారుల సంఘ అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి, రైతు ఐక్యవేదిక నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి, పాపన్న, శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని