logo

పట్టణాభివృద్ధే ప్రధాన లక్ష్యం

పట్టణ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని పుర అధ్యక్షురాలు బోగ శ్రావణి అన్నారు. జగిత్యాల పురపాలక సాధారణ సమావేశం బుధవారం నిర్వహించారు.

Published : 29 Sep 2022 04:53 IST

జగిత్యాల బల్దియా సమావేశం


మాట్లాడుతున్న ఛైర్‌పర్సన్‌ శ్రావణి

జగిత్యాల పట్టణం, న్యూస్‌టుడే: పట్టణ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని పుర అధ్యక్షురాలు బోగ శ్రావణి అన్నారు. జగిత్యాల పురపాలక సాధారణ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ ఘాట్ల వద్ద బతుకమ్మ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు రూ.2.60 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా పట్టణంలో విద్యుద్దీపాలంకకరణకు కూడా నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. మొత్తం ఎజెండాలోని 27 అంశాలు ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ గంగాధర్‌ పాల్గొన్నారు. అభివృద్ధి, మహనీయుల వర్ధంతి, జయంతి పేరిట బల్దియా అక్రమాలకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ ఫ్లోర్‌లీడర్‌ కల్లపల్లి దుర్గయ్య ఆరోపించారు. ఒక్కో కార్యక్రమానికి రూ.30 వేల వ్యయం పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని సభ దృష్టికి తెచ్చారు. డీజిల్‌ బిల్లుల పేరిట మళ్లీ దోపిడీకి తెరలేపారని జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అక్రమాలన్నింటిపైనా కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు విచారణ చేపట్టాలని కాంగ్రెస్‌ కౌన్సిలర్లు నక్క జీవన్‌, అసియా సుల్తానా, సహరాభాను, ఫర్హీన్‌సుల్తానా, ములస్తం లలితలు కోరారు. 

24 అంశాలకు ఆమోదం
కోరుట్ల: పట్టణాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. బుధవారం పురపాలక సంఘ సమావేశంలో ఛైర్‌పర్సన్‌ అన్నం లావణ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. 24 అంశాలకు కౌన్సిల్‌ సభ్యులు ఏకగీవ్రంగా అమోదం తెలిపారు. ఛైర్‌పర్సన్‌ మాట్లాడుతూ కోరుట్ల మున్సిపల్‌కు జాతీయస్థాయిలో రెండు అవార్డులు రావడం అదృష్టంగా భావిస్తుమన్నారు. ఈఅవార్డు రావడానికి కృషి చేసిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జాతీయ నాయకుల విగ్రహాలను కూడళ్లలో, డివైడర్ల మధ్యలో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు పాతబకాయిల చెక్కులను అందజేశారు. ఎమ్మెల్యే, ఛైర్‌పర్సన్‌, వైస్‌ఛైర్మన్‌లను పారిశుద్ధ్య కార్మికులు ఘనంగా సన్మానించారు. వైస్‌ఛైర్మన్‌ గడ్డమీది పవన్‌, కమిషనర్‌ అయాజ్‌, డీఈఈ అభినయ్‌, ఏసీపీ శ్రీనివాస్‌రావు, ఏఈ లక్ష్మి, మేనేజర్‌ శ్రీనివాస్‌, సానిటరీ ఇన్స్‌పెక్టర్‌ గజానంద్‌ తదితరులు పాల్గొన్నారు. 


కోరుట్లలో పారిశుద్ధ్య కార్మికులకు పాతబకాయిల చెక్కులను అందజేస్తున్న దృశ్యం

భగీరథ పనులపై ఎమ్మెల్యే ఆగ్రహం
మెట్‌పల్లి పట్టణం: పట్టణంలో జరుగుతున్న మిషన్‌ భగీరథ పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారని అధికారులపై ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుర అధ్యక్షురాలు రాణవేని సుజాత అధ్యక్షతన బుధవారం బల్దియా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఉద్యోగి అజెండాలోని 25 అంశాలను చదివి వినిపించగా కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఆమోదించారు. సత్వరమే భగీరథ పనులను పూర్తి చేయాలని భగీరథ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్‌ సమ్మయ్య, వైస్‌ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌రావు, పుర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని