logo

కళ మెచ్చేలా.. వీక్షకులకు నచ్చేలా..

వందలాది మంది కళాకారులు.. 20 రాష్ట్రాలకు చెందిన కార్యక్రమాలు.. కళల కాణాచిగా పేరొందిన తెలంగాణ ఖ్యాతిని నిలిపేలా.. ఉమ్మడి జిల్లాలోని ప్రతిభాధీరుల ప్రతిభను చాటేలా రేపటి నుంచి నిర్వహించే కళోత్సవాలకు కరీం‘నగరం’ ముస్తాబైంది.

Published : 29 Sep 2022 04:53 IST

కళోత్సవాలకు మైదానం ముస్తాబు
ఈనాడు, కరీంనగర్‌


ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి కమలాకర్‌, పక్కన అధికారులు

వందలాది మంది కళాకారులు.. 20 రాష్ట్రాలకు చెందిన కార్యక్రమాలు.. కళల కాణాచిగా పేరొందిన తెలంగాణ ఖ్యాతిని నిలిపేలా.. ఉమ్మడి జిల్లాలోని ప్రతిభాధీరుల ప్రతిభను చాటేలా రేపటి నుంచి నిర్వహించే కళోత్సవాలకు కరీం‘నగరం’ ముస్తాబైంది. తారా ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో మూడ్రోజులపాటు ముచ్చటైన వేడుకను నిర్వహించడానికి  జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను పూర్తిచేసింది. అంబేడ్కర్‌ మైదానంలో ఇందుకోసం అవసరమైన వేడుకను సిద్ధం చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు  నగరానికి చేరుకున్నారు. ఇక్కడి ఏర్పాట్ల తీరుని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, నగర మేయర్‌ సునీల్‌రావు, అదనపు డీసీపీ శ్రీనివాస్‌లు పర్యవేక్షించారు. మంత్రి గంగుల స్వయంగా రాసిన పాటను పాడారు. రికార్డింగు చేసిన పాటను వేదికపై వినిపించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించే ఈ వేడుకలు.. తెలంగాణ చరిత్రలోనే కరీంనగర్‌ కళోత్సవాలు ఒక మైలురాయిగా నిలుస్తాయన్నారు. సినీ కళాకారులతోపాటు గాయకులు, జానపద కళాకారులు దాదాపుగా 500 మంది పాల్గొంటారని తెలిపారు.

షెడ్యూల్‌ ఇలా...
* గురువారం సాయంత్రం 6 గంటలకు బాణాసంచా వెలుగులతోపాటు క్యాంప్‌పైర్‌ నిర్వహణ
* 30న సాయంత్రం 5 గంటలకు మంత్రి కేటీఆర్‌ వేడుకలను ప్రారంభించనున్నారు.
* ప్రతి రోజు సాయంత్రం 5 గంటలనుంచి రాత్రి 11 గంటల వరకు ప్రదర్శనలుంటాయి.
* 1వ తేదీన సర్కస్‌ మైదానం నుంచి వందలాది మంది కళాకారులతో ప్రదర్శన ర్యాలీ
* 2వ తేదీ కార్యక్రమ ముగింపు వేడుకల్లో బాణా సంచా వెలుగుల ప్రత్యేక ప్రదర్శన

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని