logo

వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు

వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తూ రుణాలు విరివిగా ఇవ్వాలని  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి బ్యాంకు అధికారులను ఆదేశించారు.

Published : 29 Sep 2022 04:53 IST


మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, వేదికపై అధికారులు, బ్యాంకర్లు

సిరిసిల్ల(విద్యానగర్‌), న్యూస్‌టుడే: వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తూ రుణాలు విరివిగా ఇవ్వాలని  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి బ్యాంకు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లాస్థాయి బ్యాంకర్ల సమీక్షాసమావేశం బుధవారం జరిగింది. కమిటీ ఛైర్మన్‌ కలెక్టర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2022-23 వార్షిక లక్ష్యాలు, ఇప్పటివరకు సాధించిన ప్రగతిపై కలెక్టర్‌ బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు. వార్షిక రుణ ప్రణాళిక కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.2,692 కోట్ల రుణాల మంజూరు లక్ష్యం కాగా ఇప్పటివరకు వివిధ కేటగిరీల కింద రూ.486 కోట్లను మంజూరు చేసినట్లు తెలిపారు. షార్ట్‌ టర్మ్‌ పంట రుణాల లక్ష్యం రూ.647 కోట్లు ఉండగా, రూ.83 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు అవుతున్నా రుణ మంజూరు లక్ష్యసాధన ఆశించిన మేర లేదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం(పీఎంఎఫ్‌ఎంఈ పథకం) అమలుపై బ్యాంకులు సంపూర్ణ సహకారం అందించాలని కలెక్టర్‌ కోరారు. యూనిట్ల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక రైతులు, యువతకు రుణ మంజూరు కన్సెంట్లను ఇవ్వాలన్నారు. పాడి గేదెల యూనిట్ల కోసం దరఖాస్తు పెట్టుకున్న రైతులకు రుణాలను మంజూరు చేయాలని పేర్కొన్నారు. మధ్యమానేరు జలాశయం ముంపు గ్రామాల ప్రజలకు వివిధ కేటగిరీలలో యూనిట్ల స్థాపనకు ముందుకు వస్తే రుణ మంజూరులో బ్యాంకర్లు వారికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. వార్షిక రుణ ప్రణాళిక లక్ష్య సాధనకు సంక్షేమ అధికారులు, ఒక్కో బ్యాంక్‌ నుంచి ఒక్కో బాధ్యుడిని చేర్చి వాట్సాప్‌ గ్రూప్‌పెట్టుకొని లక్ష్యాల పురోగతి పెంచాలని లీడ్‌ బ్యాంక్‌ జిల్లా మేనేజర్‌కు సూచించారు.  ఎల్‌డీఎం టీఎన్‌ మల్లికార్జున్‌రావు, జిల్లా అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, డీఆర్‌డీవో గౌతమ్‌రెడ్డి, యూబీఐ డిప్యూటీ రీజనల్‌ హెడ్‌ వంశీకృష్ణ, ఆర్‌బీఐ ఎల్‌డీవో ఎంఎస్‌.సాయి చరణ్‌, నాబార్డ్‌ డీడీఎం మనోహర్‌రెడ్డి, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని