logo

మట్టి యంత్రం.. ఉపాధి మంత్రం

‘అత్యధిక ఎర్త్‌మూవర్స్‌(పొక్లెయిన్లు) కలిగిన గ్రామంగా జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలోని రాఘవపేట నిలుస్తుంది. గతంలో ఉపాధి కరవై గల్ఫ్‌ బాట పట్టిన వారితో పాటు డిగ్రీ పట్టాలను పక్కన పెట్టిన యువత పొక్లెయిన్లతో ఉపాధి మార్గాన్ని ఎంచుకుంది.

Published : 29 Sep 2022 04:53 IST


రాఘవపేట గ్రామం 

న్యూస్‌టుడే, మల్లాపూర్‌: ‘అత్యధిక ఎర్త్‌మూవర్స్‌(పొక్లెయిన్లు) కలిగిన గ్రామంగా జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలోని రాఘవపేట నిలుస్తుంది. గతంలో ఉపాధి కరవై గల్ఫ్‌ బాట పట్టిన వారితో పాటు డిగ్రీ పట్టాలను పక్కన పెట్టిన యువత పొక్లెయిన్లతో ఉపాధి మార్గాన్ని ఎంచుకుంది. రాష్ట్రంలోని పది జిల్లాలతో పాటు దేశంలోని ఆరు రాష్ట్రాల్లో చేపట్టే తవ్వకాలకు సంబంధించిన పనులకు ఇక్కడ యంత్రాలను పంపిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వంటి భారీ ప్రాజెక్టులతో పాటు క్వారీల్లో రాళ్లను తొలగించడం, ప్రైవేటుగా పలు రకాల పనులు సాగుతుండటం వీరికి వరంగా మారింది. ప్రస్తుతం గ్రామంలో 96 ఎర్త్‌మూవర్స్‌ ఉన్నాయి. 

ఆరు రాష్ట్రాల్లో పనులు
రాష్ట్రంతో పాటు సమీప రాష్ట్రాల్లో ఎర్త్‌మూవర్స్‌తో పనులు ఆధికంగా ఉండటంతో రాఘవపేట యువకులు ముందుగా ఎంచుకున్న ప్రాంతానికి యంత్రాలను చేరవేసి పనులు చేస్తుంటారు. రాఘవపేటకు చెందిన యంత్రాలను ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను ఇక్కడి యంత్రాలతో చేపడుతున్నారు. నూతన రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పనులు ఎక్కువ కావడంతో ఒక్కొక్కరు రెండు నుంచి మూడు యంత్రాలను కొనుగోలు చేసి నడిపిస్తున్నారు.

గల్ఫ్‌ బాట వీడి
గతంలో గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన వారు తిరిగి స్వగ్రామానికి చేరుకుని పొక్లెయిన్‌లను కొనుగోలు చేసి జీవనోపాధి పొందుతున్నారు. ఉపాధి కోసం ఉన్న ఊరును, కన్నవారిని వదిలి గల్ఫ్‌ దేశాలకు వెళ్లడంకన్నా కుటుంబ సభ్యులతో కలిసి ఉంటూ వ్యాపారం చేసుకోవడం ఎంతో బాగుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామం కాస్త పట్టణ ప్రాంతంగా రూపాంతరం చెందుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని