logo

ఉమ్మడి జిల్లాకే ఆదర్శంగా సుల్తానాబాద్‌ ప్యాక్స్‌

సుల్తానాబాద్‌ ప్రాథమిక సహకార సంఘం రైతులకు బహుళ సేవలు అందిస్తూ, రూ.35 కోట్ల లావాదేవీలతో ఉమ్మడి జిల్లాలోనే ఆదర్శంగా నిలుస్తోందని టెస్కాబ్‌ ఛైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు అన్నారు.

Published : 02 Oct 2022 06:10 IST

సంఘం ఆధ్వర్యంలో తయారు చేసిన నీటి సీసాలను ప్రదర్శిస్తున్న టెస్కాబ్‌ ఛైర్మన్‌ రవీందర్‌రావు,

ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తదితరులు

సుల్తానాబాద్‌, న్యూస్‌టుడే: సుల్తానాబాద్‌ ప్రాథమిక సహకార సంఘం రైతులకు బహుళ సేవలు అందిస్తూ, రూ.35 కోట్ల లావాదేవీలతో ఉమ్మడి జిల్లాలోనే ఆదర్శంగా నిలుస్తోందని టెస్కాబ్‌ ఛైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు అన్నారు. సంఘం ఆధ్వర్యంలో ఐఎస్‌ఐ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన నీటిశుద్ధి, బాటిలింగ్‌ కేంద్రాలు, వ్యాపార సముదాయం, గిడ్డంగులను ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం రైతులకు గృహ, కర్షక, వాహన, వ్యాపార రుణాలు అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్‌రావు మాట్లాడుతూ కేడీసీసీబీ సుల్తానాబాద్‌ శాఖలో రూ.125 కోట్ల లావాదేవీలు జరగడం గర్వకారణమన్నారు. బ్యాంకు ఆధ్వర్యంలో యూపీఏ లావాదేవీలు కూడా ప్రారంభం కావడం శుభసూచకమన్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ అధ్యక్షుడు శ్రీగిరి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సుల్తానాబాద్‌ పీఏసీఎస్‌ విజయవంతంగా నడుస్తోందని, ఇటీవల మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ సహకార సంఘాలు, నాబార్డు ఉద్యోగుల బృందాలు సంఘాన్ని సందర్శించడమే ఇందుకు నిదర్శమన్నారు. రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కాసర్ల అనంతరెడ్డి, ఎంపీపీ బాలాజీరావు, జడ్పీటీసీ సభ్యురాలు స్వరూప, సంఘం అధ్యక్షుడు శ్రీగిరి శ్రీనివాస్‌, ఏఎంసీ ఛైర్మన్‌ బుర్ర శ్రీనివాస్‌, డీసీవో మైకేల్‌బోస్‌, డీఏవో ఆదిరెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని