logo

ఎన్టీపీసీలో 1249 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి

రామగుండం ఎన్టీపీసీ విద్యుత్తు పరిశ్రమలో గడిచిన సెప్టెంబరులో 66 శాతం పీఎల్‌ఎఫ్‌తో 1249 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.

Published : 02 Oct 2022 06:10 IST

జ్యోతినగర్‌, న్యూస్‌టుడే : రామగుండం ఎన్టీపీసీ విద్యుత్తు పరిశ్రమలో గడిచిన సెప్టెంబరులో 66 శాతం పీఎల్‌ఎఫ్‌తో 1249 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. గత ఆరు మాసాల్లో 71 శాతం పీఎల్‌ఎఫ్‌(ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌)తో 8092 మి.యూ. విద్యుత్తును సాధించినట్లు వివరించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 17421 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యం కాగా, రానున్న ఆరు నెలల్లో 9329 మి.యూ. విద్యుత్తు ఉత్పత్తి సాధించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని