logo

ఘనంగా సద్దుల బతుకమ్మ

పుట్టినింట్లో.. మెట్టినింట్లో సద్దుల బతుకమ్మ జరుపుకునేందుకే ఏడు రోజుల బతుకమ్మ వేడుకలు ప్రారంభయ్యాయని కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలత అన్నారు. ఆసిఫ్‌నగర్‌, ఖాజీపూర్‌లో శనివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీపీ బతుకమ్మ పేర్చి, ఆడిపాడి వేడుకల్లో పాల్గొన్నారు.

Updated : 02 Oct 2022 07:06 IST

బస్టాండ్‌ ప్రాంగణంలో బతుకమ్మ ఆడుతున్న మహిళా ఉద్యోగులు

కరీంనగర్‌ కొత్తపల్లి, న్యూస్‌టుడే: పుట్టినింట్లో.. మెట్టినింట్లో సద్దుల బతుకమ్మ జరుపుకునేందుకే ఏడు రోజుల బతుకమ్మ వేడుకలు ప్రారంభయ్యాయని కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలత అన్నారు. ఆసిఫ్‌నగర్‌, ఖాజీపూర్‌లో శనివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీపీ బతుకమ్మ పేర్చి, ఆడిపాడి వేడుకల్లో పాల్గొన్నారు. కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌ ఛైర్మన్‌ రెడ్డవేణి మధు, సతీమణి సుప్రియ వేడుకల్లో ఆడిపాడారు. వేడుకల్లో సర్పంచులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

బొమ్మకల్‌(కరీంనగర్‌ గ్రామీణం), న్యూస్‌టుడే: కరీంనగర్‌ రూరల్‌ మండలం బొమ్మకల్‌లో వాడవాడలా మహిళలు అంబరాన్ని అంటేలా సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకున్నారు. రూరల్‌ జడ్పీటీసీ సభ్యురాలు పురుమల్ల లలిత, ఎంపీటీసీ సభ్యురాలు ర్యాకం లక్ష్మీలు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఆయా కాలనీల్లో ఉత్సవ కమిటీలు బతుకమ్మ ఉత్సవాలకు ముందస్తు ఏర్పాట్లు చేశారు.


ఆసిఫ్‌నగర్‌లో ...

తెలంగాణచౌక్‌ (కరీంనగర్‌) : కరీంనగర్‌ ప్రయాణ ప్రాంగణ ఆవరణలో ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఒకటో, రెండో డిపోల ఉద్యోగినులు, మహిళా సిబ్బంది బతుకమ్మ ఆడారు.  కరీంనగర్‌ ఒకటో, రెండో డిపో డీఎంలు భూపతిరెడ్డి, వి.మల్లయ్య వేడుకలకు హాజరై ఉద్యోగులకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని