logo

నగరానికి గాంధీజీ ప్రతిమ

తెలంగాణ రాష్ట్రంలోని కరీôనగర్‌ నగరంలో ప్రతిష్ఠించేందుకు 1500 కిలోల కంచుతో తయారైన 10 అడుగుల ఎత్తున్న ‘ధ్యాన గాంధీ’ విగ్రహం శనివారం గుంటూరు జిల్లా తెనాలి నుంచి తరలివెళ్లింది.

Published : 02 Oct 2022 06:10 IST

తెలంగాణ రాష్ట్రంలోని కరీôనగర్‌ నగరంలో ప్రతిష్ఠించేందుకు 1500 కిలోల కంచుతో తయారైన 10 అడుగుల ఎత్తున్న ‘ధ్యాన గాంధీ’ విగ్రహం శనివారం గుంటూరు జిల్లా తెనాలి నుంచి తరలివెళ్లింది. పట్టణంలోని వహాబ్‌రోడ్డులో ఉన్న సూర్య శిల్పశాలలో శిల్పులు కాటూరి వేంకటేశ్వరరావు, రవిచంద్రలు విగ్రహాన్ని సహజత్వం ఉట్టిపడేలా రూపొందించారు. మంత్రి గంగుల కమలాకర్‌ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు శిల్పులు ‘న్యూస్‌టుడే’తో చెప్పారు.  

- న్యూస్‌టుడే, తెనాలి టౌన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని