logo

అందుబాటులోకి అత్యాధునిక వైద్య సేవలు

పరిసర, ప్రభావిత గ్రామాల్లో అందుబాటులోకి అత్యాధునిక వైద్య సేవలతో మరో అడుగు పడిందని ఎన్టీపీసీ సీజీఎం సునీల్‌కుమార్‌ పేర్కొన్నారు. ఎన్టీపీసీ సీఎస్సార్‌ కింద ఏర్పాటు చేసిన మొబైల్‌ ఆస్పత్రిని పీటీఎస్‌లో ఆదివారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

Published : 03 Oct 2022 04:59 IST


మొబైల్‌ ఆస్పత్రిని జెండా ఊపి ప్రారంభిస్తున్న సీజీఎం సునీల్‌కుమార్‌

జ్యోతినగర్‌, న్యూస్‌టుడే : పరిసర, ప్రభావిత గ్రామాల్లో అందుబాటులోకి అత్యాధునిక వైద్య సేవలతో మరో అడుగు పడిందని ఎన్టీపీసీ సీజీఎం సునీల్‌కుమార్‌ పేర్కొన్నారు. ఎన్టీపీసీ సీఎస్సార్‌ కింద ఏర్పాటు చేసిన మొబైల్‌ ఆస్పత్రిని పీటీఎస్‌లో ఆదివారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రసవానంతరం, ప్రసవానికి ముందు, చిన్నారులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణకు ఈ మొబైల్‌ ఆస్పత్రి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. నెలలో 24 రోజులు సమీప గ్రామాలు, కాలనీల్లో వైద్య సేవలను అందిస్తుందన్నారు. మాతా శిశు ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. మొబైల్‌ ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులు, ఫార్మసిస్టు, నర్సులు, అటెండెంట్‌ అందుబాటులో ఉంటారని, 17 గ్రామాల్లో సేవలు అందిస్తుందని వివరించారు. ముఖ్య వైద్యాధికారి లహరి, సీఎస్సార్‌ అధికారి ఎస్‌ఎస్‌.త్రివేదియా పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని