logo

పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేయాలని సీఎంకు వినతి

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ కోరారు. హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో ఆదివారం సీఎంను కలిసిన ఆయన పరిశ్రమల కేంద్రమైన రామగుండంలో పాలిటెక్నిక్‌ కళాశాల అవసరాన్ని విన్నవించారు.

Published : 03 Oct 2022 04:59 IST


సీఎం కేసీఆర్‌తో చందర్‌

గోదావరిఖని, న్యూస్‌టుడే : రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ కోరారు. హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో ఆదివారం సీఎంను కలిసిన ఆయన పరిశ్రమల కేంద్రమైన రామగుండంలో పాలిటెక్నిక్‌ కళాశాల అవసరాన్ని విన్నవించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని కూడా గోదావరిఖనిలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రామగుండం నగరపాలక ప్రాంతానికి రూ.100 కోట్ల ప్రత్యేక నిధులను కేటాయించాలని, ఇండస్ట్రీయల్‌ పార్కును త్వరగా ఏర్పాటు చేయాలని విన్నవించారు. రామగుండం ప్రాంతాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు కార్పొరేషన్‌కు రూ.100 కోట్ల నిధులను కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని