logo

నిధుల సద్వినియోగం.. అభివృద్ధి పథం

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను సద్వినియోగించుకంటూ పాలకుర్తి మండలంలోని ఎల్కలపల్లి గ్రామం అభివృద్ధిపథంలో ముందుకు సాగుతోంది. రామగుండం ఎన్టీపీసీ పునరావాస గ్రామం కావడంతో కొన్నేళ్లుగా ఎన్టీపీసీ యాజమాన్యం సామాజిక బాధ్యతలో భాగంగా సామాజిక భవనం, పాఠశాలకు అదనపు తరగతి గదులు, శుద్ద జలకేంద్రం, గ్రామంలో వీధి దీపాలతో పాటు వివిధ సదుపాయాలను కల్పించారు.

Published : 04 Oct 2022 05:47 IST

పునరావాస గ్రామంలో ప్రగతి కాంతులు

న్యూస్‌టుడే, ఎల్కలపల్లి ఫెర్టిలైజర్‌ సిటీ

పూర్తి కావచ్చిన స్వశక్తి మహిళా భవనం

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను సద్వినియోగించుకంటూ పాలకుర్తి మండలంలోని ఎల్కలపల్లి గ్రామం అభివృద్ధిపథంలో ముందుకు సాగుతోంది. రామగుండం ఎన్టీపీసీ పునరావాస గ్రామం కావడంతో కొన్నేళ్లుగా ఎన్టీపీసీ యాజమాన్యం సామాజిక బాధ్యతలో భాగంగా సామాజిక భవనం, పాఠశాలకు అదనపు తరగతి గదులు, శుద్ద జలకేంద్రం, గ్రామంలో వీధి దీపాలతో పాటు వివిధ సదుపాయాలను కల్పించారు. తరచూ వైద్య శిబిరాలు నిర్వహిస్తూ గ్రామీణుల ఆరోగ్య సంరక్షణలో ఎన్టీపీసీ యాజమాన్యం చేదోడుగా నిలుస్తోంది. కొన్ని దశాబ్దాలుగా గ్రామీణులు ఎదుర్కొంటున్న రహదారి సమస్య పరిష్కారానికి ఎన్టీపీసీ యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఇలా ఓవైపు ఎన్టీపీసీ యాజమాన్యం ఎల్కలపల్లి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తుండగా మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులతోను భవనాలు, రహదారుల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. కాలినడకకు సైతం ఇబ్బందిపడే ప్రాంతంలో సిమెంటు రహదారి నిర్మించడంతో ఆయా ప్రాంతవాసుల సమస్య పరిష్కారమైనట్లయింది.

రూ.కోటి నిధులతో పురోభివృద్ధి

డి.ఎం.ఎఫ్‌.టి., ఉపాధి హామీ పథకం తదితర నిధులు సుమారు రూ.కోటి వ్యయంతో గ్రామంలో పలు అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. రహదారుల నిర్మాణాలు దాదాపుగా పూర్తికాగా భవన నిర్మాణాలు సాగుతున్నాయి. డి.ఎం.ఎప్‌.టి. నిధులు రూ.18 లక్షలతో చింతల చెరువు సమీపంలో సామాజిక భవనం, రూ.5 లక్షలతో చింతల చెరువులో బతుకమ్మ ఘాట్‌, మరో రూ.18 లక్షలతో స్వశక్తి మహిళా భవన నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. బిల్లుల చెల్లింపులో జాప్యంతో కొద్దిపాటి పనులు నిలిచిపోగా వాటిని సైతం త్వరితగతిన పూర్తి చేయించేందుకు గ్రామ పంచాయతీ పాలకవర్గం, అధికారులు ప్రయత్నిస్తున్నారు. డి.ఎం.ఎఫ్‌.టి. నిధులు రూ.10 లక్షలతో అంగన్‌వాడీ పాఠశాల భవన నిర్మాణం పనులు చేపట్టగా స్లాబు పనులు పూర్తయి గోడలు నిర్మాణం చేస్తున్నారు. గ్రామంలో రెండు అంగన్‌వాడీ కేంద్రాలుండగా ఒకదానికి సొంత భవనం ఉండగా మరో దానికి లేకపోవడంతో స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్నారు. తాజాగా మరో అంగన్‌వాడీ కేంద్రానికి సైతం సొంత భవన నిర్మాణం చేపడుతుండడంతో సమస్య పరిష్కారం కానుంది. సుమారు రూ.10 లక్షలతో చింతల చెరువు కట్ట మరమ్మతులు చేపట్టగా, మరో రూ.20 లక్షలతో గ్రామంలోని పలు ప్రాంతాల్లో సిమెంటు రహదారులు నిర్మించారు. ఉపాధి హామీ పథకం నిధులతో శ్మశాన వాటిక, చెత్త నిర్వహణ కేంద్రం, పలు ప్రాంతాల్లో మట్టి రోడ్ల నిర్మాణం చేపట్టారు. గ్రామ కూడళ్లలో హైమాస్టు లైట్లు ఏర్పాటు చేయడంతో గ్రామంలో వెలుగులు విరజిమ్ముతున్నాయి.

చింతల చెరువులో పూర్తయిన బతుకమ్మ ఘాఫట్‌ నిర్మాణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని