logo

ప్రజావ్యతిరేక విధానాలు ప్రజలకు వివరించండి

నూతనంగా నియమితులైన మహిళా కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు ఇంటింటికి వెళ్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి అన్నారు.

Updated : 04 Oct 2022 06:27 IST

మాట్లాడుతున్న మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి

మెట్‌పల్లి, న్యూస్‌టుడే: నూతనంగా నియమితులైన మహిళా కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు ఇంటింటికి వెళ్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి అన్నారు. సోమవారం మెట్‌పల్లి పట్టణంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి నర్సింగరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అనంతరం మెట్‌పల్లి పట్ణణ అధ్యక్షురాలిగా అందె భవిత, మండల అధ్యక్షురాలిగా చెన్నూరు నిర్మల, మల్లాపూర్‌ కోటగిరి ప్రమోధిని, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షురాలిగా లక్కిడి నర్సక్కకు నియామక పత్రాలు అందించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నక్క, కృష్ణారావు, రాంప్రసాద్‌, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని