logo

బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు

బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీసు కమిషనర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు.

Updated : 04 Oct 2022 06:25 IST

గోదావరిఖని, న్యూస్‌టుడే : బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీసు కమిషనర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడాన్ని నిషేధించినట్లు వెల్లడించారు. కమిషనరేట్‌ పరిధిలో ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతాయని, అక్టోబరు 1 నుంచి నవంబరు 1 వరకు హైదరాబాద్‌ నగర పోలీసు చట్టం ఐపీసీ 188 ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. డ్రోన్‌ కెమెరాలు, డీజేలను కూడా నెల రోజుల పాటు నిషేధించినట్లు తెలిపారు. తప్పనిసరి అయితే అనుమతి తీసుకుని మైక్‌సెట్‌ను ఏర్పాటు చేసుకోవాలని, డ్రోన్‌ కెమెరాలను వినియోగించకూడదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని