logo

నూలు రాయితీ చెల్లించాలని ధర్నా

బతుకమ్మ చీరలకు సంబంధించి మరమగ్గాల కార్మికులకు ప్రభుత్వం 10 శాతం యారన్‌ రాయితీ చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం సిరిసిల్లలోని చేనేత, జౌళిశాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.

Published : 04 Oct 2022 05:47 IST

సిరిసిల్లలో ధర్నా చేస్తున్న కార్మికులు

సిరిసిల్ల (విద్యానగర్‌), న్యూస్‌టుడే: బతుకమ్మ చీరలకు సంబంధించి మరమగ్గాల కార్మికులకు ప్రభుత్వం 10 శాతం యారన్‌ రాయితీ చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం సిరిసిల్లలోని చేనేత, జౌళిశాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్‌ మాట్లాడుతూ 2019 సంవత్సరానికి సంబంధించిన బతుకమ్మ చీరలకు సంబంధించి కొంతమంది మరమగ్గాల కార్మికులకు మాత్రమే 10 శాతం యారన్‌ రాయితీ అందించారన్నారు. ఇంకా చాలా మంది కార్మికుల ఖాతాల్లో రాయితీ డబ్బులు జమ చేయలేదన్నారు. చేనేత, జౌళిశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. కార్మికుల ఉత్పత్తి వివరాలన్నీ చేనేత, జౌళిశాఖ కమిషనర్‌కు పంపించినా యారన్‌ రాయితీ జమ చేయకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా స్పందించి మరమగ్గాల కార్మికుల ఖాతాలలో యారన్‌ రాయితీ జమ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, టెక్స్‌టైల్‌ పార్క్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కూచన శంకర్‌, పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు నక్క దేవదాస్‌, గుండు రమేశ్‌, మునీందర్‌, రాజమల్లు, సురేశ్‌, ఆంజనేయులు, గడ్డం ఐలయ్య, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని