logo

భర్తకు దహన సంస్కారాలు చేసిన భార్య

భర్త మృతి చెందగా భార్య దహన సంస్కారాలు నిర్వహించిన సంఘటన శంకరపట్నం మండలం మొలంగూర్‌ గ్రామంలో సోమవారం చోటు చేసుకొంది. చల్లూరి పోచయ్య(55) పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. అనారోగ్యంతో ఆదివారం రాత్రి మృతి చెందారు.

Updated : 04 Oct 2022 06:26 IST

మొలంగూర్‌(శంకరపట్నం), న్యూస్‌టుడే: భర్త మృతి చెందగా భార్య దహన సంస్కారాలు నిర్వహించిన సంఘటన శంకరపట్నం మండలం మొలంగూర్‌ గ్రామంలో సోమవారం చోటు చేసుకొంది. చల్లూరి పోచయ్య(55) పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. అనారోగ్యంతో ఆదివారం రాత్రి మృతి చెందారు. పిల్లలు లేకపోవడంతో భార్య కొమురమ్మ దహన సంస్కారాలు నిర్వహించింది. సర్పంచి అనూష భర్త శ్రీనివాస్‌ పాడే మోసి బాధిత కుటుంబానికి రూ.10,000 అందించారు.


రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

శంకరపట్నం,న్యూస్‌టుడే: తాడికల్‌ వద్ద జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. హుజూరాబాద్‌ మండలం తుమ్మనపల్లి గ్రామానికి చెందిన మిడిదొడ్డి రాజేశ్‌ కరీంనగర్‌ నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది.


బాధిత కుటుంబానికి ఆర్థికసాయం

గంగాధర, న్యూస్‌టుడే: గంగాధర మండలం మల్లాపూర్‌కు చెందిన కౌలురైతు జనార్దన్‌ గతంలో మృతి చెందగా ఆయన కొడుకు ఇటీవల ప్రమాదంలో గాయపడ్డాడు. కుటుంబ పరిస్థితి తెలుసుకున్న భాజపా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దూలం కల్యాణ్‌ చక్రధర్‌గౌడ్‌ దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం బాధిత కుటుంబానికి రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు. సర్పంచి ఆకుల శంకరయ్య, వినయ్‌సాగర్‌, మల్లేశ్‌యాదవ్‌, గడ్డిబాలు పాల్గొన్నారు.


పేద విద్యార్థినికి...

వీణవంక, న్యూస్‌టుడే: వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుకాసి అశ్రిత అనే విద్యార్థినికి ఉన్నత చదువుల కోసం ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటంతో వీణవంకకు చెందిన పాడి ఉదయనందన్‌రెడ్డి రూ. 50 వేలు ఆర్థిక సాయం చేశారు. చిన్నాల అయిలయ్య యాదవ్‌, ప్రభాకర్‌లు ఆయన తరుపున నగదు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని