logo

చిత్ర వార్తలు

రూరల్‌ మండలం నగునూరులోని శ్రీదుర్గాభవాని ఆలయంలో దుర్గాభవాని నవరాత్రుల్లో భాగంగా సోమవారం అమ్మవారు దుర్గామాత అలంకరణలో సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకుడు పవనకృష్ణశర్మ అమ్మవారికి విశేష హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated : 04 Oct 2022 06:25 IST

సింహ వాహనంపై దుర్గాభవాని అమ్మవారు

నగునూరు(కరీంనగర్‌ గ్రామీణం), న్యూస్‌టుడే: రూరల్‌ మండలం నగునూరులోని శ్రీదుర్గాభవాని ఆలయంలో దుర్గాభవాని నవరాత్రుల్లో భాగంగా సోమవారం అమ్మవారు దుర్గామాత అలంకరణలో సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకుడు పవనకృష్ణశర్మ అమ్మవారికి విశేష హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు

దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఫెర్టిలైజర్‌ సిటీలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో సోమవారం రుద్ర చండీ హోమం నిర్వహించారు. అమ్మవారిని దుర్గాదేవి రూపంలో అలంకరించారు. ఆలయ పూజారి కర్నె అశోక్‌శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.  - న్యూస్‌టుడే, ఫెర్టిలైజర్‌ సిటీ


సింహ వాహనంపై శ్రీవారు

కోరుట్ల పట్టణంలోని పురాతన శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి సింహ వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. పూజారి బీర్నంది నర్సింహాచారి ఆధ్వర్యంలో భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి కొలిచారు. ప్రత్యేక రథంపై స్వామివారిని పట్టణంలోని పురవీధుల్లో శోభాయాత్ర చేపట్టారు. - న్యూస్‌టుడే, కోరుట్ల


మహాగౌరి రూపం.. కుమారిపూజ

జగిత్యాల పట్టణంలో శరన్నవరాతులు సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి. సేవాసమితులు, భక్త బృందాల ఆధ్వర్యంలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక కనకదుర్గ సేవాసమితి ఆధ్వర్యంలో అమ్మవారు మహాగౌరి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. సామూహిక కుమారిపూజ, అభిషేకం, నక్షత్ర హారతి, చండీ హవనం కార్యక్రమంలో భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.- న్యూస్‌టుడే, జగిత్యాల విద్యానగర్‌

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సోమవారం శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రధాన ఆలయంతో పాటు శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాగౌరీ రూపంలో అమ్మవారిని అలంకరించగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈఓ సంకటాల శ్రీనివాస్, ఇందారపు రామయ్య, సభ్యులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. దేవస్థానంలో సోమవారం రాత్రి నంది వాహనంపై శ్రీ రామలింగేశ్వరస్వామి వారి సేవను ఊరేగించారు. రాత్రి 8 గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు శ్రీ రామలింగేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నంది వాహనంపై ఆసీనులను చేశారు.  - న్యూస్‌టుడే, ధర్మపురి 


రహదారి ఆక్రమణ.. వాహనదారుల తంటాలు

గోదావరిఖని అడ్డగుంటపల్లి నుంచి ఇందిరానగర్‌, గౌతమినగర్‌, మార్కండేయకాలనీ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా కంకరతో నింపడంతో అటుగా వెళ్లాల్సిన వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భవన నిర్మాణదారులు మూడు రోజులుగా ఇలాగే రోడ్డుపై వదిలేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. - న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని