logo

కూడళ్ల సుందరీకరణ పనులు ప్రారంభం

గోదావరిఖని పట్టణంలోని ప్రధాన కూడళ్ల సుందరీకరణ పనులను ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మంగళవారం ప్రారంభించారు. రూ.కోటి నిధులతో రాజేశ్‌ థియేటర్‌, ఫైవింక్లైన్‌ చౌరస్తాల సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

Published : 05 Oct 2022 05:16 IST

మార్కింగ్‌ పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే చందర్‌

గోదావరిఖని, న్యూస్‌టుడే : గోదావరిఖని పట్టణంలోని ప్రధాన కూడళ్ల సుందరీకరణ పనులను ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మంగళవారం ప్రారంభించారు. రూ.కోటి నిధులతో రాజేశ్‌ థియేటర్‌, ఫైవింక్లైన్‌ చౌరస్తాల సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. వీటిని పూర్తి చేసిన అనంతరం తిలక్‌నగర్‌, రమేశ్‌నగర్‌, స్వతంత్రచౌక్‌ కూడళ్లను అభివృద్ధి చేస్తామన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రధాన రోడ్డుతో పాటు కూడళ్ల సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట నగర మేయర్‌ అనిల్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు, నగర కమిషనర్‌ సుమన్‌రావు, తెరాస నాయకులు జె.వి.రాజు, వేణు, మారుతి, సంజీవ్‌, తిరుపతి పాల్గొన్నారు.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని