logo

దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు

దసరా ఉత్సవాలకు సింగరేణి క్రీడా మైదానం సిద్ధమైంది. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఏటా సింగరేణి క్రీడా మైదానంలో నిర్వహించే దసరా ఉత్సవాల్లో భాగంగా రావణాసుర వధ.. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సకలం సిద్ధ చేశారు.

Published : 05 Oct 2022 05:16 IST

రావణబ్రహ్మ ఏర్పాటుకు సిద్ధం

గోదావరిఖని, న్యూస్‌టుడే : దసరా ఉత్సవాలకు సింగరేణి క్రీడా మైదానం సిద్ధమైంది. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఏటా సింగరేణి క్రీడా మైదానంలో నిర్వహించే దసరా ఉత్సవాల్లో భాగంగా రావణాసుర వధ.. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సకలం సిద్ధ చేశారు. పది తలల రావణబ్రహ్మ చిత్రాలను తీసుకొచ్చారు. బాణసంచాను సిద్ధం చేశారు. కళాకారులతో ఆటపాట, శాస్త్రీయ, జానపద నృత్యాలతో ప్రదర్శనలు చేపట్టనున్నారు. నగరపాలక సంస్థ నిధులతో చేపట్టనున్న దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే ప్రజలకు గ్యాలరీలను ఏర్పాటు చేశారు. బారికేడ్లు నిర్మించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని