logo

మన ఊరు- మన బడి పనుల పూర్తికి ఆదేశం

జిల్లాలో మన ఊరు- మన బడి కార్యక్రమం కింద మంజూరైన పనులను పూర్తి చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో మన ఊరు- మన బడి కార్యక్రమం పనుల పురోగతిపై ఈడబ్ల్యూఐడీసీ ఈఈ విరూపాక్ష,

Published : 05 Oct 2022 05:16 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల (విద్యానగర్‌), న్యూస్‌టుడే: జిల్లాలో మన ఊరు- మన బడి కార్యక్రమం కింద మంజూరైన పనులను పూర్తి చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో మన ఊరు- మన బడి కార్యక్రమం పనుల పురోగతిపై ఈడబ్ల్యూఐడీసీ ఈఈ విరూపాక్ష, డీఈఈ సమ్మిరెడ్డిలతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మొదటి విడత కింద గంభీరావుపేట మండలంలోని 15 పాఠశాలలు, వీర్నపల్లి మండలంలోని 8 పాఠశాలలు, ఎల్లారెడ్డిపేట మండలంలోని 14 పాఠశాలలు, ఇల్లంతకుంట మండలంలోని 17 పాఠశాలలు మొత్తం 54 పాఠశాలల్లో రూ.4.78 కోట్లతో సివిల్‌ వర్క్స్‌ చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. వీటిలో 7 పాఠశాలలు మినహా మిగతా వాటిలో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. పాఠశాలల్లో చేపట్టిన మరుగుదొడ్లు, వంట గది నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సివిల్‌ వర్క్స్‌ పూర్తి చేసిన వెంటనే పెయింటింగ్‌ చేసేందుకు జిల్లాలో ఓ సంస్థను గుర్తించామని తెలిపారు. పెయింటింగ్‌ పనులు పూర్తయితే వర్కులకు సంబంధించి వందశాతం పని పూర్తయినట్లు కలెక్టర్‌ తెలిపారు. పూర్తయిన వాటికి ఎంబీ రికార్డ్‌ పూర్తి చేసిన వెంటనే నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్‌లు పాల్గొన్నారు.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని