logo

విశేషాలంకరణలు.. మహిషాసుర సంహార లీల

దేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు మహానవమి సందర్భంగా మంగళవారం అమ్మవారి ఆలయాల్లో విశేషాలంకరణ.. మహిషాసుర సంహార లీల కార్యక్రమాలు నిర్వహించారు. మహాశక్తి ఆలయంలో మహిషాసురమర్దిని దేవి రూపంలో, పసుపు కొమ్ముల అలంకరణతో మహాదుర్గ అమ్మవారు దర్శనమిచ్చారు.

Published : 05 Oct 2022 05:16 IST

మహిషాసుర సంహార లీలను ప్రారంభిస్తున్న ఎంపీ బండి సంజయ్‌

కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: దేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు మహానవమి సందర్భంగా మంగళవారం అమ్మవారి ఆలయాల్లో విశేషాలంకరణ.. మహిషాసుర సంహార లీల కార్యక్రమాలు నిర్వహించారు. మహాశక్తి ఆలయంలో మహిషాసురమర్దిని దేవి రూపంలో, పసుపు కొమ్ముల అలంకరణతో మహాదుర్గ అమ్మవారు దర్శనమిచ్చారు. మహా చండీ హోమం, పూర్ణాహుతి, దీక్షా విరమణ కార్యక్రమాలు నిర్వహించారు. నగర ప్రధాన పురోహితులు మంగళంపల్లి శ్రీనివాసశర్మ, ఆలయ అర్చకులు వంశీశర్మ, కొరడె శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన పూర్ణాహుతి, మంత్ర పుష్పం కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, భక్తులు పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి దీక్షపరులు నవరాత్రి దీక్షను విరమించారు. రాత్రి  భక్తజన సందోహం మధ్య మహిషాసుర సంహార లీల ఎంపీ బండి సంజయ్‌ ప్రారంభించారు. గర్రెపల్లి మహేశ్వర్‌శర్మ దేవి భాగవత ప్రవచనం కొనసాగింది.   దేవాలయంలో అర్ధరాత్రి వరకు దాండియా ఆటలు కొనసాగాయి.

మహాశక్తి ఆలయంలో మహిషాసుర సంహార లీల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని