logo

కొత్తపల్లి మున్సిపాలిటీకి రూ.2 కోట్ల నిధులు

స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 అవార్డు అందుకున్న మున్సిపల్‌ ఛైర్మన్‌ రుద్ర రాజు, జిల్లా అదనపు కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వేణుమాధవ్‌, పర్యావరణ ఇంజినీర్‌ రమేష్‌ను మంగళవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీఐ దాశరథి ఆడిటోరియంలో రాష్ట్ర పురపాలక,

Published : 05 Oct 2022 05:16 IST

ఛైర్మన్‌ రుద్ర రాజును సన్మానిస్తున్న మంత్రి కేటీఆర్‌

కరీంనగర్‌ కొత్తపల్లి, న్యూస్‌టుడే: స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 అవార్డు అందుకున్న మున్సిపల్‌ ఛైర్మన్‌ రుద్ర రాజు, జిల్లా అదనపు కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వేణుమాధవ్‌, పర్యావరణ ఇంజినీర్‌ రమేష్‌ను మంగళవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీఐ దాశరథి ఆడిటోరియంలో రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు శాలువాతో సత్కరించారు. జాతీయ స్థాయి సౌత్‌జోన్‌ విభాగంలో 25వేల లోపు జనాభా కలిగిన మున్సిపాలిటీల్లో కొత్తపల్లి అగ్రస్థానంలో నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని వచ్చే ఏడాది సర్వేలో మొదటి స్థానంలో ఉండేలా కృషి చేస్తామన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య యంత్రాలు, వైకుంఠ రథం కొనుగోలుకు రూ.2కోట్లు మంజూరు చేస్తూ సీడీఎంఏకు ఆదేశాలిచ్చినట్లు ఛైర్మన్‌ రాజు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌శాఖ సీఎస్‌ అరవింద్‌కుమార్‌, కార్యదర్శి సుదర్శన్‌, సీడీఎంఏ సత్యనారాయణ, ఆస్కి డైరెక్టర్‌ శ్రీనివాసచారి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని