logo

రూ.28 కోట్లు తాగేశారు

తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగ వచ్చిందంటే చాలు సంబరాలు అంబరాన్నంటుతాయి. రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా బతుకమ్మ, దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకోలేదు. ఈ సారి మాత్రం ఏ గ్రామంలో చూసినా సంబరాలు ఘనంగా సాగాయి.

Published : 07 Oct 2022 04:17 IST

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగ వచ్చిందంటే చాలు సంబరాలు అంబరాన్నంటుతాయి. రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా బతుకమ్మ, దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకోలేదు. ఈ సారి మాత్రం ఏ గ్రామంలో చూసినా సంబరాలు ఘనంగా సాగాయి. ఈ ఏడాది అక్టోబర్‌ మొదటి వారంలోనే దసరా రాగా అనుకున్నదాని కంటే ఎక్కువగా మద్యం అమ్మకాలు జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. అక్టోబర్‌ 1 నుంచి 5వ తేదీ వరకు కరీంనగర్‌ అర్బన్‌, కరీంనగర్‌ రూరల్‌, తిమ్మాపూర్‌, హుజూరాబాద్‌, జమ్మికుంట సర్కిల్‌ పరిధిలో ఉన్న 94 మద్యం దుకాణాల ద్వారా రూ.28 కోట్ల అమ్మకం జరిగినట్లు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. సాధారణంగా నెలకు రూ.70 నుంచి రూ.80 కోట్ల మద్యం వ్యాపారం జరుగుతుండగా 5వ తేదీ వరకే రూ.28కోట్ల విక్రయాలు సాగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని