logo

108 సేవలు మరింత చేరువ

108 పేరు తెలియని వారుండరు. ఎక్కడ ప్రమాదం జరిగినా.. ఫోన్‌ చేసిన వెంటనే సాధ్యమైన వరకు క్షతగాత్రుల ప్రాణాలు రక్షించడానికి సిబ్బంది ప్రయత్నిస్తుంటారు.

Published : 26 Nov 2022 04:54 IST

న్యూస్‌టుడే, కరీంనగర్‌ సంక్షేమ విభాగం

108 పేరు తెలియని వారుండరు. ఎక్కడ ప్రమాదం జరిగినా.. ఫోన్‌ చేసిన వెంటనే సాధ్యమైన వరకు క్షతగాత్రుల ప్రాణాలు రక్షించడానికి సిబ్బంది ప్రయత్నిస్తుంటారు. వీరి సేవలు ప్రజలకు మరింత చేరువకానున్నాయి. ఇప్పటివరకు ఫోన్‌ చేస్తే చిరునామా ఎక్కడ అని తెలుసుకొని వాహనం తమకు కేటాయించిన ప్రాంతం నుంచి వస్తుండేది. ఈ వ్యవస్థను మరింత సులభం చేయనున్నారు. ఏంటా విధానం.. ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో వివరిస్తూ కథనం.

జిల్లాలో 14 వాహనాలు..

కరీంనగర్‌ జిల్లాలో మొత్తం 108 వాహనాలు 14 ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రెండు, చింతకుంటలో ఒకటి ఉంది. హుజురాబాద్‌లో రెండు ఉండగా మిగతా మండలాల్లో కొత్తపల్లి, గంగాధర, వీణవంక, జమ్మికుంట, సైదాపూర్‌, చిగురుమామిడి, చొప్పదండి, మానకొండూర్‌, శంకరపట్నంలో ఒక్కొక్కటి ఉన్నాయి. 108 వాహనాలను ప్రస్తుతం జీవీకే ఈఎంఆర్‌ఐ సంస్థ నడుపుతుంది. ఇప్పటికే టెండర్లను కోరారు. త్వరలో నూతన టెండర్‌ ఖారారు కానుంది. ఈ నేపథ్యంలో టెండర్‌ ఎవరికి వచ్చిన ప్రభుత్వం కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు.

మార్పు ఇలా..

* వాహనాలను జిల్లా కేంద్రంతోపాటు అన్నీ మండల ప్రధాన కేంద్రాల్లో నిలుపుతున్నారు. ప్రమాదం జరిగిందని ఫోన్‌ రాగానే వాహనాలు వెళ్తున్నాయి. ఎప్పటికి ఒకే దగ్గర ఉండేవి.
* నూతన విధానంలో ఒకే దగ్గర వాహనాలు ఉండకుండా చూస్తారు. వాహనాలు రద్దీగా ఉండే గంటలు, రద్దీ లేని గంటలను పరిశీలిస్తున్నారు.
* రహదారి వెడల్పు లేకుండా, ఇరుకుగా ఉన్నవి ప్రమాదాలు అధికంగా జరిగే స్థలాలను గుర్తించి వాహనాలను అదే రహదారిలో అందుబాటులో ఉంచనున్నారు.
* ఫోన్‌ చేయగానే హైదరాబాద్‌ కాల్‌ సెంటర్‌ నుంచి ఇక్కడి 108 సిబ్బందికి వివరాలు తెలిపేవారు.
* త్వరలో సిబ్బందికి స్మార్ట్‌ఫోన్‌ ఇవ్వడంతోపాటు వివరాలన్నీ తెలిపిన తర్వాత ప్రమాదం జరిగిందని ఫోన్‌ చేసిన వ్యక్తికి వాహనం నుంచి ఒక లింక్‌ వస్తుంది. ఆ లింక్‌ ఓపెన్‌ చేయగానే వాహనం ఎక్కడి నుంచి వస్తుంది. ఎక్కడి వరకు వచ్చిందనే వివరాలు ఫోన్‌ చేసిన వ్యక్తికి తెలిసిపోతాయి.
* ఇద్దరు, ముగ్గురు మంత్రులు పర్యటన నేపథ్యంలో అక్కడికి ఒక వాహనాన్ని పంపనున్నారు.
* జిల్లా కేంద్రంలో ఉన్న వాహనాలను జిల్లా కేంద్రం నలుమూలల ఏర్పాటు చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని