logo

గ్రంథాలయానికి విద్యుత్తు నిలిపివేత

నిరుద్యోగ యువతకు బాసటగా నిలవాల్సిన గ్రంథాలయాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. మెట్‌పల్లి పట్టణంలోని కూరగాయల మార్కెట్లో గ్రంథాలయ భవనాన్ని నూతనంగా నిర్మిస్తుండడంతో తాత్కాలికంగా కొత్తబస్టాండ్‌ పక్కన గల పాత మండల పరిషత్‌ భవనంలో గ్రంథాలయాన్ని ఏర్పాటుచేశారు.

Published : 28 Nov 2022 03:40 IST

తక్కువ వెలుతురులోనే చదువుతున్న నిరుద్యోగులు

మెట్‌పల్లి పట్టణం, న్యూస్‌టుడే: నిరుద్యోగ యువతకు బాసటగా నిలవాల్సిన గ్రంథాలయాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. మెట్‌పల్లి పట్టణంలోని కూరగాయల మార్కెట్లో గ్రంథాలయ భవనాన్ని నూతనంగా నిర్మిస్తుండడంతో తాత్కాలికంగా కొత్తబస్టాండ్‌ పక్కన గల పాత మండల పరిషత్‌ భవనంలో గ్రంథాలయాన్ని ఏర్పాటుచేశారు. మండల పరిషత్‌ భవనానికి సంబంధించి సుమారు రూ.30 వేల వరకు బకాయిలు ఉండడంతో విద్యుత్తు అధికారులు సరఫరాను నిలిపివేశారు. దీంతో గ్రంథాలయానికి వచ్చే నిరుద్యోగులు చీకట్లోనే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. మండల పరిషత్‌ విద్యుత్తు మీటరును మిషన్‌ భగీరథ వారు వినయోగించడంతో అధిక బిల్లులు వస్తున్నాయి. బిల్లులు చెల్లింపులో ఏమాత్రం జాప్యం చేసినా విద్యుత్తు అధికారులు సరఫరాను నిలిపివేస్తున్నారు.  


తరచూ సరఫరాలో లోపం

నిత్యం డబ్బా గ్రామం నుంచి వచ్చి గ్రంథాలయంలో చదువుకుంటున్నాను. ఇక్కడ తరచూ విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో ఇబ్బందులు పడుతూ చదవలేక పోతున్నాం. దోమల బెడద ఉంది. విద్యుత్తు సౌకర్యం కల్పించాలి.

శ్రీనివాస్‌, డబ్బా


చీకట్లోనే చదువుతున్నాం..

నిత్యం ఇక్కడకు వచ్చి గ్రూపు-2కు సిద్దమవుతున్నాను. కొన్నిరోజుల నుంచి విద్యుత్తు సరఫరా నిలిపి వేయడంతో చీకట్లోనే చదవాల్సి వస్తుంది. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు.

వినీల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని