logo

నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి పోరాటం

మధ్యమానేరు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంలో  ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వారి సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్‌ నిరంతరం పోరాటం చేస్తుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు.

Published : 28 Nov 2022 03:40 IST

పాదయాత్రలో మాజీ ఎంపీ పొన్నం, పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్‌, నాయకులు

వేములవాడ, న్యూస్‌టుడే: మధ్యమానేరు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంలో  ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వారి సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్‌ నిరంతరం పోరాటం చేస్తుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. ఆదివారం మధ్యమానేరు నిర్వాసిత గ్రామాల సమస్యల పరిష్కారం కోరుతూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో వేములవాడ మండలంలోని సంకెపల్లి నుంచి శాభాష్‌పల్లి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఇందులో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పాల్గొని మాట్లాడారు. మధ్యమానేరు జలాశయం పూర్తయి నాలుగేళ్లు గడిచినా నిర్వాసితుల సమస్యలు తీరలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చిన సమయంలో నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు ఇస్తానన్న రూ.5.4 లక్షల హామీని ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. అపరిష్కృతంగా ఉన్న ముంపు గ్రామాల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించని తెరాస, భాజపా నాయకులకు రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.  కార్యక్రమలో పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్‌, పట్టణ అధ్యక్షుడు వెంకటస్వామి, మండల అధ్యక్షుడు పిల్లి కనుకయ్య, నాయకులు సంగీతం శ్రీనివాస్‌, బాలరాజు, ముడికె చంద్రశేఖర్‌, కూస రవీందర్‌, జగన్మోహన్‌రెడ్డి, పండుగ ప్రదీప్‌, కదిరె రాజు, ఆగయ్య, శ్రీనివాస్‌, సత్యలక్ష్మి, భారతి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు